7
వచ్చే ఏప్రిల్ నెలలో భరతదేశపు ప్రీమియం ఎక్స్పో, భారత్ ప్రో సౌండ్, లైట్ ఎక్సపో నగరంలో ఘనంగా జరగనుంది. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ ను నగరంలోని ఓ హోటల్లో సంస్థ సీఈవో దిలీప్ కుమార్ సోనల్, కాళిప్రసాద్ విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వచ్చేనెల 16, 17, 18 తేదీలలో ఋషికొండ ఏ1 గ్రాండ్ లో ఈ ఎక్స్పో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రో సౌండ్, లైటింగ్, ఎస్ ఎఫ్ ఎక్స్, ఆడియో విజువల్ మరియు టెంట్ డెకరేషన్ రంగాల్లో వస్తున్న అత్యాధునిక సాంకేతికతను ఈ ఎక్స్పోలో ప్రదర్శించినున్నామన్నారు. ఇన్నోవేటివ్ లైటింగ్ వంటి విభాగాలు సరికొత్త ఆవిష్కరణలను చూడాలనుకునే వారికి ఇది ఒక చక్కని వేదిక కానుందని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.