*పంచదార్ల అసైన్డ్ భూముల జోలికి రావద్దు.. అధికారులు మొండికేస్తే ఉద్యమం రాష్ట్ర స్థాయికి మారుస్తాం…*
*విదసం హెచ్చరిక.*.
అచ్యుతాపురం/ యలమంచిలి: 17 ఫిబ్రవరి
పంచదార్ల అసైన్డ్ భూములు జోలికి వస్తె ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో ఉదృతం చేస్తామని దళితుల భూముల స్వాధీనానికి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు తక్షణమే వెనక్కి తీసుకోవాలని విదసం (విస్తృత దళిత సంఘాల) ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట రావు డిమాండు చేసారు. గత 15 రోజులుగా పంచదార్ల అసైన్డ్ రైతులు ఉద్యమo చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు విదసం ఐక్య వేదిక ఆధ్వర్యంలో పలు సంఘాల దళిత నాయకులు ఉద్యమానికి సంఘీభావం ప్రకటిoచారు. ఈ సందర్భంగా నిరసన శిబిరాన్ని ఉద్దేశించి వెంకట రావు మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షల ఎకరాల అసైన్డ్ భూములు అన్యాక్రాంతం అవుతుంటే వాటిని కాపాడలేని అధికార యంత్రాంగం ఇక్కడ అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రయతించడంలో పెద్ద కుట్ర దాగి ఉందన్నారు..
కృష్ణ పాలానికి పునరావాసం కల్పించడానికి దళితుల అసైన్డ్ భూములే దొరికాయా అని ప్రశ్నించారు. ఎదురువాడ , దెబ్బపాలెం లో ఏపీ ఐ ఐ సీ కి చెందిన 20 ఎకరాలు ,30 ఎకరాలు భూములు ఉండగా రెవిన్యూ అధికారులు కన్ను పంచదార్ల
దళితుల భూములు పై పడిందని ఇది దళితుల పట్ల అధికారుల వివక్ష అని మండి పడ్డారు.. రాంబిల్లి మండలం లో కట్టా వెంకటేశ్ కుటుంబానికి చెందిన 5 ఎకరాల అసైన్డ్ భూమి బిసి కులస్తుడు కబ్జా చేస్తే దాన్ని ఎమ్ ఆర్ ఓ అరికట్ట లేక పోయారు, ఇదే అసైన్డ్ భూములు వ్యవహారంలో లక్ష ఇభైవేలు వేలు లంచం మింగిన తన సహచర సిబ్బంది పై కనీస చర్యలు తీసుకోలేదు, మండల కేంద్రం లో సర్వే నంబర్ 89 లో 25 ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతుంటే పట్టించు కోనీ తహసీల్దార్ ఇక్కడకు వచ్చి అసైన్డ్ భూములు తీసుకుంటారా అని ప్రశ్నించారు. ఈ ఏం ఆర్ ఓ కు ఆదేశాలు ఇచ్చే జిల్లా ఆధికారులు జిల్లా వ్యాపితంగా కశింకోట మండలం లో తాళ్ళ పాలెంలో గెడ్డ పోరంబోకు, అనకాపల్లి శారదా నది గట్టు వద్ద సర్వే నంబర్ 62 లో ఎకరన్నర, శారదా గట్టుకు ఇరువైపుల 15 ఎకరాలు, సత్య నారాయణ పురం సర్వే నంబర్ 338/3 లో కొండ పోరాబోకు ప్రభుత్వ భూముల కబ్జా పై పత్రికల్లో వార్తలు వచ్చినా స్పందించని జిల్లా రెవిన్యూ అధికారులు కేవలం పంచదార్ల అసైన్డ్ భూముల దుర్వినియోగం అంటూ స్వాధీన ఉత్తర్వులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ఏభై ఏళ్ల క్రితం దళితులకు ప్రభుత్వం ఇచ్చిన 40 ఎకరాల అసైన్డ్ భూములు తీసుకోవడానికి దళితులను బెదిరించడం అట్రాసిటీ నేరం ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు ఒక్క అడుగు ముందుకు వేసినా అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వెంకట రావు హెచ్చరించారు..
గాధo అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాజి ఓంకార్, నేతల నాగేశ్వర రావు,ఐ దేవుడు బాబు, గోడు వెంకటేశ్వర రావు, బుడతల అప్పారావు, పాము నాగ భూషణం , ఎమ్ శ్రీనివాస్, కూరపాటి అప్పారావు, గుడివాడ ప్రసాద్, దిమ్మల జగ్గారావు తదితరులు పాల్గొన్నారు
పంచదార్ల అసైన్డ్ భూముల జోలికి రావద్దు.. !!#vvwnews
2
previous post