మార్కెట్ లో చేతక్ సి-25 వెహికల్ ఆవిష్కరణ
విశాఖపట్నం : విశాఖ ప్రభుత్వ మహిళా కళాశాలలో బజాజ్ చేతక్ సీ 25 నూతన వెహికల్ ను ఆవిష్కరించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మంజుల చేతుల మీదుగా ఈ నూతన వాహనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ
మార్కెట్లో విడుదలైన
ఈ కొత్త వాహనం ప్రయాణానికి ఎంతో సులభతరంగా ఉంటుందని చెప్పారు.
ముఖ్యంగా మహిళలకు, విద్యార్థినులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు. మరో వైపు పర్యావరణ పరిరక్షణ కు దోహదపడే చేతక్ సీ 25
తప్పకుండా ప్రతి ఇంట్లో ఉండాలని పేర్కొన్నారు. చేతక్
సేల్స్ మేనేజర్ ఎల్లయ్య రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్ ధరలోనే ఈ కొత్త వాహనం అందరికీ అందుబాటులో ఉందని చెప్పారు. ఉద్యోగినులకు అలాగే విద్యార్థులకు ఈ వాహనం ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు. వినియోగదారుల అభిరుచి మేరకు సరికొత్త డిజైన్లలో, అందరినీ ఆకట్టుకునే కలర్లలో, వివాహనం మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగిందన్నారు.
ప్రస్తుత రహదారులకు అనుగుణంగా ఈ వాహనం రూపొందించడం జరిగిందన్నారు.
ఈ కొత్త వాహనం
మంచి మైలేజ్ ఇస్తుందన్నారు. వాహన ప్రియులు
కచ్చితంగా తాము కొనుగోలు చేయాల్సిన వాహనాలలో ఈ సరికొత్త బజాజ్ చేతక్ సి-25 వాహనం తప్పకుండా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బజాజ్ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్, మేనేజర్ కనకరాజు పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినిలకు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.