ఎపిలెప్సీకి భయపడాల్సిన అవసరం లేదని medicover హాస్పిటల్స్ న్యూరాలజీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
సకాలంలో గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే, ఎపిలెప్సీ ఉన్నవారు కూడా పూర్తిగా సాధారణ జీవితం గడపవచ్చని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా సుమారు ఐదు కోట్ల మందికి పైగా, భారత్‌లో దాదాపు ఒక కోటి ఇరవై లక్షల మంది ఎపిలెప్సీతో జీవిస్తున్నారని అంచనా.
అవగాహన లోపం, అపోహలు, భయం కారణంగా చాలా మంది చికిత్సను ఆలస్యం చేస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.
న్యూరాలజిస్ట్ డాక్టర్ ___ కే సత్య రావు మాట్లాడుతూ,
ఎపిలెప్సీ అంటువ్యాధి కాదని, మానసిక సమస్య కూడా కాదని, ఇది పూర్తిగా మెదడుకు సంబంధించిన నాడీ వ్యాధి అని తెలిపారు.
నిరంతరంగా మందులు వాడితే సుమారు 70 శాతం మంది రోగుల్లో మూర్చ దాడులు పూర్తిగా నియంత్రణలోకి వస్తాయని చెప్పారు.
పీడియాట్రిక్ న్యూరాలజిస్టులు పిల్లల్లో లక్షణాలను తొలిదశలోనే గుర్తించడం చాలా కీలకమని సూచించారు.
అవసరమైతే ఆధునిక శస్త్రచికిత్సలు, నర్వ్ స్టిమ్యులేషన్ చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయని నిపుణులు తెలిపారు.
లక్షణాలు కనిపించిన వెంటనే న్యూరాలజిస్టును సంప్రదిస్తే, ఆరోగ్యకరమైన జీవితం పూర్తిగా సాధ్యమని వైద్యులు సూచిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ టి. సురేష్, డాక్టర్ కే. సురేష్, డాక్టర్ పవన్ రుద్ర, మెడికల్ హాస్పిటల్స్ సెంటర్ హెడ్ డాక్టర్ అరుణ్ కుమార్ పాల్గొన్నారు.