టూరిజం మలేషియా సిల్స్ మిషన్ 2026 సదస్సు
విశాఖపట్నం 9 ఫిబ్రవరి 2026 స్థానిక దాడిసన్ బ్లూ రిసార్టు నందు మలేషియా అసోసియేషన్ ఆఫ్ టూర్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్ (MATTA) భాగస్వామ్యంతో టూరిజం మలేషియా సేల్స్ మిషన్-2026 సదస్సు ఈరోజు (9 ఫిబ్రవరి2026) నిర్వహించారు. ఈ సదస్సునకు టూరిజం మలేషియా చైర్మన్ దాతుక్ మనోహరన్ పెరియసామి మరియు టూరిజం మలేషియాలోని ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ (ఆసియా/ఆఫ్రికా) విభాగం సీనియర్ డైరెక్టర్ శ్రీమతి నువాల్ ఫాదిలా బింటి కు అజ్మీ అధ్యక్షత వహించారు. ఈ సదస్సు మలేషియా నుండి 49 మంది విక్రయదారులను మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కీలకమైన వాణిజ్య భాగస్వాములను ఒకే వేదికపైన చేర్చినది.
భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతంలో టూరిజం మలేషియా ఉనికిని విస్తరించటం, తద్వారా దక్షిణ భారత మార్కెట్లలో మలేషియా భాగస్వామ్యం బలోపేతం చేయటం ఈ టూరిజం మలేషియా సిల్స్ మిషన్-2026 ప్రాధాన లక్ష్యం. భారతదేశం నుండి మలేషియా వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ రావటం ఇందుకు నిదర్శనం. 1,365,387 మంది పర్యాటకులు 2024 లోను మరియు 1,565,194 మంది పర్యాటకులు 2025 లోను మలేషియా సందర్శించారు. సష్టమైన వృద్ధి కనిపిస్తున్నాది. 2026లో 2.1 మిలియన్ల పర్యాటకుల లక్ష్యంగా టూరిజం మలేషియా విస్తరణ కొనసాగిస్తున్నట్లు ఈ సదస్సులో వెల్లడించారు. భారత్ మరియు మలేషియా దేశాల మధ్య పర్యాటక డిమాండ్ నకు మద్దతుగా దేశంలోని 14 నగరాల నుండి 47,399 సీట్ల కెపాసిటీతో 238 డైరక్టు వీక్లీ విమానాల అనుసంధానత ఉంది. ఈ విషయంలో దక్షిణ భారతదేశం 29,541 సీట్ల సామర్థ్యంతో 151 డైరెక్టు వీక్లీ విమానాలుతో మలేషియా ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేయటంలో కీలక పాత్రను పోషిస్తున్నాది.
ఈ సందర్భంగా మలేషియా పర్యాటక సంస్థ చైర్మన్ దాతుక్ మనోహరస్ పెరియసామి మాట్లాడుతూ, వాణిజ్య భాగస్వామ్యాలను పటిష్ట పరచటం, విభిన్న పర్యాటక శాఖలను ప్రోత్సహించటం పైన మలేషియా దృష్టి సారించటం గురించి వివరించారు. విశ్రాంతి పొందుటకు, సెలవులు గడిపేందుకు, ప్రకృతి ఆరాధనకు, వాణిజ్య వ్యాపారాలకు వగైరా వాటి కోసం మలేషియా సందర్శించు వారికి సేల్స్ మిషన్ మలేషియా అందిస్తున్న విస్తృత శ్రేణి ఆఫర్లను తెలియచేసారు. భారతీయులలో వివాహ మరియు వివాహానంతర పర్యటనకు పెరుగుతున్న డిమాండును ప్రత్యేకంగా చెప్పారు.
ఈ సదస్సులో శ్రీ హిషాముద్దీన్ ముస్తఫా, డైరక్టర్/ టూరిజం మలేషియా చెన్నై వారు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో విశాఖపట్నం మలేషియాకు అత్యంత ఆశాజనకమైన మార్కెట్ అందించటంలో కీలక పత్ర పోషిస్తుంది అన్నారు. ఇక్కడ సరికొత్త అవకాశాలకు మలేషియా సేల్స్ మిషన్ ఒక ముఖ్య వేదికగా పనిచేస్తుంది అన్నారు.
ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ (ఆసియా/ఆఫ్రికా) డివిజన్ సీనియర్ డైరెక్టర్ శ్రీమతి సువాల్ ఫాదిలా బింటి కు అజ్మీ, మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాపార సహకారాన్ని పటిష్టప్రచుటకు మలేషియా విక్రేతలు మరియు భారతీయ వాణిజ్య భాగస్వాములను ఒకే వేదిక పైకి తీసుకు రావటం ఈ సదస్సు ముఖ్య లక్ష్యం అన్నారు. టూరిజం మలేషియా నవీకరించిన ఉత్పత్తులు మరియు సరికొత్త ఆఫర్ లతో దక్షిణ భారతదేశం అంతటా వాణిజ్య విస్తరణకు కట్టుబడి ఉంటుందని ప్రధానంగా మలేషియా ఇయర్ 2026 దిశగా మలేషియా సందర్శనను ప్రోత్సహిస్తుందని ఆమె పేర్కొన్నారు.
మలేషియా సిల్స్ మిషన్ 2026 కు అధికారిక ఎయిర్‌లైన్ బాటిక్ ఎయిర్ మద్దతు ఇస్తుండగా, విశాఖపట్నం కార్యక్రమానికి భాగస్వామి ఎయిర్ సీగా స్కూట్ మద్దతు అందిస్తుంది. వాటి నెట్వర్క్ ద్వారా మలేసియాకు కనెక్టివిటీ మరియు ప్రయాణ అవకాశాలు మరింత సౌకర్యవంతం,బలోపేతం అవుతాయి అన్నారు.