3 స్టార్ వాకర్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కంచరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో నూతన సభ్యులంతా కలిసి ప్రమాణస్వీకారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూటమి నాయకులు చల్లా ఈశ్వరరావు, కుట్టా కార్తిక్, నానాజీ పాల్గొని నూతన సభ్యులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం క్లబ్ అధ్యక్షులు జనపారెడ్డి రమేష్ కుమార్ మాట్లాడుతూ.. సమాజ సేవల్లో భాగస్వామ్యం కావడమే వాకర్స్ క్లబ్ ధ్యేయం అని అన్నారు. త్రీ స్టార్ వాకర్స్ క్లబ్ 28 మంది సభ్యులతో మొదలై.. నేటికీ సుమారు 600 మందికి పైగా సభ్యులతో దిగ్విజయంగా ముందుకు సాగుతుందన్నారు. తమ కార్యవర్గాన్ని ఎంతో నమ్మకంతో గెలిపించి ఆశీర్వదించిన ప్రతి ఒక్క క్లబ్ సభ్యుడికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ మహేష్, క్లబ్ సభ్యులు వెంపటాపు నూకరాజు, రాంబాబు, శ్రీనివాస్, కిషోర్, వెంకటరమణ, ఇమ్మానుయేల్ అధిక సంఖ్యలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
3 స్టార్ వాకర్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవం ! #vvwnews #news #latestnews
6