విద్యార్థుల కోసం పర్యావరణ దినోత్సవాల క్యాలెండర్
– ఎస్ శంకర్ నాయక్, జోయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, ఎపి కాలుష్య నియంత్రణ మండలి.
ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించేందుకు ఉపకరించే విధంగా పర్యావరణ దినోత్సవ క్యాలెండర్ రూపొందించింది గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో అని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి జోయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎస్ శంకర్ నాయక్ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం సాయంత్రం మాధవధారలోని ఎపి కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ఎన్విరాన్మెంటల్ క్యాలండర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గడిచిన 25 సంవత్సరాలుగా పర్యావరణ దినోత్సవాలు క్యాలెండర్ ముద్రించడం ఆనందదాయకం అన్నారు. ప్రతి విద్యా సంస్థలో ఈ క్యాలెండర్ వినియోగించి పర్యావరణ దినోత్సవాలు నిర్వహించాలన్నారు. గ్రీన్ క్లైమేట్ టీం ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ రిసోర్స్ సెంటర్ ద్వారా అన్ని విద్యాసంస్థలకు అవసరమైన పర్యావరణ సమాచారం కూడా అందజేస్తుందన్నారు. ఐక్యరాజ్యసమితి, భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అన్ని పర్యావరణ దినోత్సవాలు ఈ క్యాలెండర్ లో ఉండటం వల్ల విద్యా సంస్థలకు చాలా బాగా ఉపకరిస్తుంది అని పేర్కొన్నారు. ఉచితంగా అందజేస్తున్న ఈ క్యాలెండర్ను చాలా విలువైనదిగా గుర్తించి ప్రతి ఒక్కరు పర్యావరణ దినోత్సవాలు నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఇ ఎస్ వీరేంద్ర, ఎస్ ఇ ఎం.రామారావునాయుడు విశాఖపట్నం రీజినల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పి వి ముకుంద రామారావు, ఇంజనీర్ డాక్టర్ శ్రీనివాస్ , గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జే వి రత్నం, యాక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రాజెక్ట్స్ ఎన్జిఓ హెచ్ఆర్డి ఐ కృష్ణకుమారి తదితరులు పాల్గొని మాట్లాడారు
విద్యార్థుల కోసం పర్యావరణ దినోత్సవాల క్యాలెండర్ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి
16
previous post