పద్మనాభం క్రైమ్ పోలీసు స్టేషన్ సందర్శించి ఇన్ స్పెక్షన్ చేపట్టిన నగర పోలీసుకమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి

by vvwnews.com

పద్మనాభం క్రైమ్ పోలీసు స్టేషన్ ను సందర్శించి ,ఇన్ స్పెక్షన్ చేపట్టిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., *నగరంలో లా & ఆర్డర్ అదుపులో ఉంచుతూ నగరం మొత్తం ప్రశాంతముగా ఉండేలా నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల నందు సిపి గారు రెండవ విడత ఇన్ స్పెక్షన్ చేపట్టడం జరుగుతుంది*, రెండవ విడత ఇన్స్పెక్షన్ లో భాగముగా సిపి గారు ఈ రోజు ఉదయం పద్మనాభం క్రైమ్ పోలీసు స్టేషన్ నందు ఇన్ స్పెక్షన్ నిర్వహించారు పోలీసు స్టేషన్ పరిసరాలను సందర్శించిన సీపీ గారు మరుగుదొడ్లు మరింత పరిశుభ్రముగా ఉండాలని, స్టేషన్ ఆవరణలో మరిన్ని మొక్కలు నాటి, పెంచాలని సూచించారు, అనంతరం సిపి గారు అధికారులు, సిబ్బంది విధులను సమీక్షించి, సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు, స్టేషన్ రికార్డులు అన్నీ సక్రమముగా ఉన్నదీ లేనిదీ పరిశీలించి, సంబంధిత అధికారులకు తగు ఆదేశాలను జారీ చేయడం జరుగుతుంది.
సదరు ఇన్స్పెక్షన్ నందు ఏసీపీ( క్రైమ్) గారు, స్టేషన్ అధికారులు మరియు సిబ్బంది హాజరు కావడం జరిగినద నగర పోలీస్ తరపున,
విశాఖపట్నం సిటీ.

Use Social Media to Spread the Word about Our News

related articles