*విల్లూరి చిన్నతల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు*
జీవీఎంసీ 33 వ వార్డు సాయిబాబా వీధిలో *విల్లూరి చిన్నతల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు సాయిబాబా వీధిలో ఘనముగా జరిగాయి* . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగ విచ్చేసిన *విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* క్రిస్మస్ వేడుకలు గురించి మాట్లాడుతూ మానవులకు ఉన్న అత్యవసరమైనది పాప క్షమాపణ రక్షణ కాబట్టి యేసయ్య రక్షకునిగా నరావతారం మెత్తుటయే క్రిస్మస్ అని చెప్పారు. 33 వ వార్డులో విల్లూరి డాక్టర్ చక్రవర్తి ఆయన అమ్మగారు పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేయడంలో మంచి సేవ తత్పరుడుగా అభివర్ణించారు. అనంతరం *టిడిపి విశాఖ పార్లమెంటు ఉపాధ్యక్షులు విల్లూరి డాక్టర్ చక్రవర్తి* మాట్లాడుతూ క్రీస్తు జన్మించిన స్థలం బెత్ల హోమ లో పశువుల పాకలో పుట్టారని తెలిపారు. యేసును అందరూ భక్తిశ్రద్ధలతో ప్రార్థన చేస్తే మనం అనుకున్న కోరికలను తీర్చే కరుణామయుడుగా నెరవేరుస్తారని అన్నారు. పిదపా *33 వ వార్డు క్లస్టర్ ఇన్చార్జ్ శ్రీమతి తిరుమల దేవి* మాట్లాడుతూ మా అమ్మమ్మ గారి పేరుతో క్రిస్మస్ వేడుకలు వార్డు ప్రజలు మధ్యన జరుపుకోవడం నాకు సంతోషకరంగా ఉంది అని అన్నారు. అనంతరం విద్యార్థులు యేసయ్య పాటలకు నృత్యము చేశారు. అనంతరం పాస్టర్ సుకుమార్ గారు దైవ సందేశాన్ని ఇవ్వడం జరిగింది. పిదప క్రిస్మస్ కేక్ ని కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. తదుపరి క్రిస్మస్ సందర్భంలో భాగంగా 500 మంది మహిళలకు చీరలు అతిధులు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే గారిని సాలువతో మరియు షీల్డ్ తో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ డివీఎస్ కే వరప్రసాద్ ,33వ వార్డు క్లస్టర్ కన్వీనర్ బంటుపిల్లి సూర్యనారాయణ, వెంకటేశ్వర మెట్ట హౌస్ వెల్ఫేర్ ప్రధాన కార్యదర్శి బి శెట్టి శ్రీనివాసరావు,కోరుబిల్లి ప్రసాద్,కోరుబిల్లి త్రినాథ్,సూరిశెట్టి శంకర్రావు,శరగడు మోహన్రావు,దాసాన సత్యనారాయణ తెలుగుదేశం 33 వా వార్డు క్లస్టర్ కన్వీనర్స్ బూత్ ప్రెసిడెంట్స గంద సత్య,పొట్నూరు ర మీనాక్షి,సింగంపల్లి మాధవి,లంక కనకదుర్గ,ఎం వెంకటలక్ష్మి,ఎండి సల్మా,రజిని,గౌరీ, ,పల్లవి తదితరులు పాల్గొన్నారు