నైపుణ్యాలతో యువతకు మెరుగైన అవకాశాలు – జాబ్ మేళాకు విశేష ఆదరణ #vvwnews

by vvwnews.com

నైపుణ్యాలతో యువతకు మెరుగైన అవకాశాలు
– జాబ్ మేళాకు విశేష ఆదరణ

సిరిపురం, డిసెంబర్ 20:

నైపుణ్యాలు కలిగిన యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని కాన్సెంట్రిక్స్ సంస్థ హెచ్ ఆర్ మేనేజర్ శైలేష్ అన్నారు. విశాఖ నగరంలో తొలిసారిగా ట్రై బి ఇన్ సి నెట్వర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన నో రెజ్యూమ్ – వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉద్యోగాలు ఎంపిక కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. విశాఖ నగరంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఏకైక లక్ష్యంతో ఎటువంటి ప్రవేశ రుసుము లేకుండా ఉచితంగా నిర్వహించిన ఈ జాబ్ మేళా భారీ విజయవంతం అయ్యింది. సిరిపురంలోని హుడా చిల్డ్రన్ ఏరీనా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాలో సుమారు 5000 మంది నిరుద్యోగ యువత ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని మేళాలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఒరిస్సా, ఛత్తీస్గడ్ తదితర రాష్ట్రాలకు చెందిన 60 కి పైగా సంస్థలు ఈ నియామక ప్రక్రియలో పాల్గొని యువత నైపుణ్యాలను పరిశీలించి ఉద్యోగ నియామకాలు నిర్వహించారు.

సంస్థ నిర్వాహకులు బి వంశీకృష్ణ, జి శివ మాట్లాడుతూ విశాఖలో ఉన్న నైపుణ్యాలు కలిగిన యువతను ఉపాధి కల్పించే సంస్థలతో అనుసంధానం చేసే దిశగా తమ సంస్థ తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందని చెప్పారు విద్యార్థుల నుంచి ఎటువంటి ప్రవేశ రుసుమును తీసుకోకుండా ఆన్లైన్ విధానంలో వారి విద్యార్హతలు నైపుణ్యాలు వంటి వివరాలను సేకరించి వారిని నేరుగా ఉపాధి అవకాశాలను కల్పించే సంస్థలతో అనుసంధానించడం జరిగిందని చెప్పారు ఇక్కడకు హాజరైన 60 కి పైగా సంస్థల హెచ్ఆర్ మేనేజర్లు ప్రత్యక్షంగా యువత నైపుణ్యాలను పరిశీలించారని జాబ్ మేళాలో 500 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు ఇప్పటికే అనేకమంది యువతకు నేరుగా అవకాశాలను కల్పిస్తూ అపాయింట్మెంట్ లెటర్లను సైతం పలు సంస్థలు అందించాయని అన్నారు. ఈ నియామక ప్రక్రియలో సేల్స్– మార్కెటింగ్, ఐటి, బిపిఓ వంటి సంస్థలు పాల్గొన్నాయి. పదవ తరగతి నుంచి పీజీ వరకు చదివిన నిరుద్యోగ యువతకు ఈ జాబ్ మేళాలో అవకాశం కల్పించడం ఎంతో సంతృప్తిని కలిగించిందని తెలిపారు. త్వరలో ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన యువతతో ఒక భారీ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. విశాఖ యువత నుంచి వచ్చిన స్పందనకు తమకు సంతృప్తి సంతోషం కలిగిందని, వారి క్రమశిక్షణ ఫలితంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో సమన్వయంతో విజయవంతం చేశామని అన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles