*పార్టీ కోసం కష్టించి పని చేసే వారికే తగిన గుర్తింపు*
*గనగల్ల రామరాజు, గుంటు ఆనంద్ లను సత్కరించిన వాసుపల్లి*
వైసీపీ పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకే తగిన గుర్తింపు లభిస్తుందని విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. జిల్లా జనరల్ సెక్రటరీ గనగళ్ల రామరాజు, జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ గా గుంటూ ఆనంద్ పదవులు వచ్చిన సందర్భంగా ఆశీలమెట్ట కార్యాలయంలో మంగళవారం వాసుపల్లి గణేష్ కుమార్ సత్కరించారు.
ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వైసీపీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కష్టించి పనిచేయాలని చెప్పారు.
భవిష్యత్తు వైసిపి పార్టీదేనని వెల్లడించారు.
ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తప్పుబట్టాలన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు.
ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని దుయ్యబట్టారు.
తమ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని తెలిపారు.
ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు.
భవిష్యత్తులో వైసిపికి మంచి రోజులు రానున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, కార్పొరేటర్ చెన్నా జానకిరామ్, జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్, తదితర సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.