*మేధా సృష్టిలో మేటి ఎస్.ఎఫ్.ఎస్*
*27 నుంచి రాష్ట్ర క్రీడా, సాంస్కృతిక పోటీలు*
*జాతీయ గీతాలు ..ప్లాస్ మాబ్ మెరుపులు*
*ముఖ్య అతిథిగా సినీ నటులు ఐనవోలు ప్రసన్న కుమార్*
సీతమ్మధార ..డిసెంబర్ 3
భావి భారత పౌరులను మేధావులుగా తీర్చిదిద్ది విశ్వానికి అందించడంలో ఎస్. ఎఫ్. ఎస్ స్కూల్స్ మేటిగా నిలుస్తున్నాయని ప్రముఖ సినీ నటులు ఐనవోలు ప్రసన్న కుమార్ పేర్కొన్నారు. సీతమ్మధార ఎస్.ఎఫ్.ఎస్ స్కూల్లో జరగనున్న రాష్ట్రస్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీల లోగోను బుధవారం ఆయన పలువురు అతిథులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఎస్.ఎఫ్. ఎస్ స్కూల్లో చదువుకున్న ఎంతోమంది నేడు దేశ,విదేశాల్లో అత్యున్నత పదవులు ద్వారా సామాజిక ప్రగతికి తోడ్పడుతున్నారని తెలిపారు. అలాగే ఎంతో మంది మేధావులు అందించిన ఘనత కూడా ఎస్.ఎఫ్. ఎస్. స్కూల్ కు దక్కుతుందన్నారు..సీతమ్మధార ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ పి.మనోజ్ మాట్లాడుతూ ఈనెల 27వ తేదీ నుంచి మూడు రోజులపాటు తమ స్కూలు ప్రాంగణంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్. ఎఫ్.ఎస్ స్కూల్ విద్యార్థుల రాష్ట్రస్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీలు జరగనున్నాయన్నారు. ఈ పోటీలకు తమ స్కూలు ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. తమ స్కూలు విద్యార్థులు స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ కు చెందిన కొరియోగ్రాఫర్ ఆర్. నాగరాజ్ పట్నాయక్ సారధ్యంలో కర్ణాటక, న్యూఢిల్లీ,ఒడిస్సా,థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా వంటి ప్రాంతాల్లో జరిగిన జాతీయ, అంతర్జాతీయ స్థాయి సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొన్నారన్నారు. విభిన్న క్రీడాంశాల్లో కూడా పాఠశాల పలు రికార్డ్స్ కైవసం చేసుకోవడం జరిగిందన్నారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఫాదర్ మనోజ్ సారధ్యంలో విద్యార్థులు క్రీడా, సాంస్కృతిక విజ్ఞాన రంగాల్లో విశ్వఖ్యాతిని అర్జిస్తున్నారని పేర్కొన్నారు.