భూపేష్ నగర్ ప్రజలకు చేయూత ఇద్దాం
– ఐ.కృష్ణకుమారి. హెచ్ ఆర్ డి కమ్యూనిటీ ట్రైనర్, ఏక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రోజెక్ట్స్.
భూపేష్ నగర్ ప్రజలకు చేయూత ఇద్దాం అని ఏక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రోజెక్ట్స్ హెచ్ ఆర్ డి కమ్యూనిటీ ట్రైనర్ ఐ కృష్ణ కుమారి అన్నారు. ఈ మేరకు గురువారం ఉదయం అల్లిపురం దగ్గర ఉన్న భూపేష్ నగర్ కు చెందిన కాయకష్టం చేసుకుని బ్రతికేవారికి టార్ఫలిన్ రగ్గులు, టార్చి లైట్లు, దోమలు రాకుండా చేసే అగర్ బత్తి పంపిణీ చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. తమ సంస్థ తుఫాన్ బాధితులకు, నిరుపేదలకు చేయూత ఇవ్వడం జరుగుతుంది అన్నారు. చిన్న వర్షం కురిసినా అక్కడ జీవించడం చాలా కష్టమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆదాయవంతంగా జీవించేందుకు తమ సంస్థ నిరంతరం చేయూత ఇవ్వడం జరుగుతుంది అని వివరించారు.
ఈ కార్యక్రమంలో భూపేష్ నగర్ మహిళలు , గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం తదితరులు మాట్లాడారు.
భూపేష్ నగర్ ప్రజలకు చేయూత ఇద్దాం #vvwnews #visakhanews
4