సంకల్ప కళా గ్రామంలో ఫ్లీట్ రివ్యూ ప్రతినిధులతో సహజరంగుల అద్దకం మీద కార్యశాల l vvw news

by vvwnews.com

సంకల్ప కళా గ్రామంలో ఫ్లీట్ రివ్యూ ప్రతినిధులతో సహజరంగుల అద్దకం మీద కార్యశాల
భారతీయ నౌక దళం విశాఖపట్నం నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫ్లీట్రివ్యూ లో భాగంగా గురువారం పెందుర్తి మండలం పినగాడి గ్రామానికి చేరువలో సంకల్ప కళ గ్రామంలో సహజరంగుల అద్దకం మీద కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 దేశాలకు సంబంధించిన సుమారు వందమంది పాల్గొన్నారు.నేవీ వెల్ఫేర్ అండ్ వెల్నెస్ అసోసియేషన్ ఈస్ట్ర న్ రీజియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సంకల్ప కళా గ్రామంలో తయారవుతున్న వివిధ చేతి వృత్తులను పరిశీలించారు. సహజ రంగులతో తయారయ్యె చేనేతలు లక్క బొమ్మలు ఎద్దు గానుగ నూనెలును పరిశీలించారు. అలాగే సంకల్పకళా గ్రామంలో సహజంగా పురాతన పద్ధతిలో తయారు చేస్తున్న పప్పు ధాన్యాలను విసరడం దంచడం వంటి పనులను వారు కూడా చేసి ఆనందించారు. అనంతరం ఈ ప్రతినిధుల బృందం సహజరంగులతో టై అండ్ డై వర్క్ షాప్ లో పాల్గొని వివిధ రకాల ఆకృతల్లో దుస్తులను కట్టి రంగులు అద్దారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన కోలాటం జానపద నృత్యంలో పాల్గొని సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అతిధిగా భారత నావికాదళ అడ్మిరల్ సతీమణి త్రిపాటి తూర్పు నావికాదళ ప్రధాన అధికారి సతీమణి బల్ల తదితర ఉన్నతాధికారుల సతీమణులు పాల్గొన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన సుమారు 60 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంకల్ప కళా గ్రామం తరపున జమీల్యా ఆకుల కార్యక్రమాలను సమన్వయపరిచారు. ఈ కార్యక్రమంలో దాట్ల వర్మ, జర్నలిస్ట్ నాయకుడు డాక్టర్ ఎంఆర్ఎన్ వర్మ గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి, తులసి నేచురల్స్ అధినేత తూర్పాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి పెందుర్తి సిఐ సతీష్ బందోబస్తు ఏర్పాటు చేశారు జీవీఎంసీ జోనల్ కమిషనర్ శంకర్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించారు. సంకల్ప కళా గ్రామం వ్యవస్థాపకులు ఆకుల చలపతి రావు, పార్వతి దంపతులు, సిబ్బంది వచ్చిన వారికి సహకారం అందించారు

Use Social Media to Spread the Word about Our News

related articles