4
ఉత్తరాంద్ర ప్రజల కల్పవల్లి, విశాఖ సిరుల తల్లి బురుజుపేటలో వెలసిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు మార్గశిర శుద్ధ పాడ్యమి అనగా 21.11.2025 శుక్రవారం నుంచి ప్రారంభమయి మార్గశిర బహుళ అమావాస్య అనగా 19.12.2025 శుక్రవారం వరకు జరుగును. ఈ సందర్బంగా ఈఓ శోభారాణి మాట్లాడుతూ ఈ మార్గశిర మాసం సందర్బంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ముఖ్యంగా లక్ష్మివారాలనాడు రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అన్నారు. కిందటి ఏడాది కంటే ఈ ఏడాది క్యూ లైన్లు పెంచుతున్నామని చెప్పారు. 21.11.25 శుక్రవారం జ్యోతి ప్రజ్వలన మరియు తొలిపూజ జరుగును. 13.12.25 న రధయాత్ర జరుగును. 18.12.2025 న సహస్ర ఘఠాభిషేకం జరుగును. లక్ష్మీవారం రోజు మాత్రం వి.ఐ.పి దర్శనం రూ.100/-
విశిష్ఠ దర్శనం రూ. 500/-, శీఘ్రదర్శనం రూ. 200/- నిర్ణయించారు.