సుందరపు విజయ్ కుమార్…
తనపై కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అవి వాస్తవాలకు కాదని, యలమంచలి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. విశాఖ పౌర గ్రంధాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యలమంచిలి నియోజకవర్గంలో మంచి పనులు చేస్తున్న తనపై కొంత మంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి నియోజకవర్గంలో క్రమం తప్పకుండా జనవాణి కార్యక్రమం నిర్వహిస్తూ అనేక సమస్యలు పరిష్కరించానని తెలిపారు. ప్రజలు వద్ద నుంచి వినతులు స్వీకరించి సంబంధింత అధికారులు దృష్టికి తీసుకువెళ్లి అనేక సమస్యలు పరిష్కరించానన్నారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నానన్నారు. భూ వ్యవహారంలో డబ్బులు తీసుకొని అగ్రిమెంట్ చేసానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ వ్యవహారంలో డిప్యూటీ సీఎం పేషీలో ఉన్న వ్యక్తులు ఉన్నారని ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.