ఆరోగ్యకరమైన ఆహారం భుజించాలి – భూమిని భవిష్యత్తు తరాలు కొసం కాపాడాలి గ్రీన్ క్లైమేట్ టీం

by vvwnews.com

ఆరోగ్యకరమైన ఆహారం భుజించాలి
– భూమిని భవిష్యత్తు తరాలు కొసం కాపాడాలి
– చిరంజీవి చౌదరి, అటవీశాఖ విశ్రాంత ప్రిన్సిపాల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్
ఆరోగ్యకరమైన ఆహారం భుజించాలి అని అటవీశాఖ విశ్రాంత ప్రిన్సిపాల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి చౌదరి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం సింహాచలం దేవస్థానం గోశాలలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సేవా సంఘం నిర్వహించిన ప్రకృతి పంటల మేళా కోసం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూమిని భవిష్యత్తు తరాలు కొసం కాపాడటం మన బాధ్యత అన్నారు. ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం, ప్రకృతి ఆధారిత పంటలు పండించే రైతులను ప్రోత్సహించడం మన బాధ్యత అన్నారు. రసాయన ఎరువులు, రసాయన క్రిమిసంహారకాలు, రసాయన కలుపు తీత ముందులు వినియోగం నివారించడానికి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడం అవసరం అని వివరించారు.
ఈ కార్యక్రమంలో భారత కిసాన్ సంఘం జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి, స్వచ్ఛ భారత్ కార్పోరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సేవా సంఘం జిల్లా అద్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, ప్రముఖ రైతు పి ఎల్ ఎన్ రాజు ఆర్ వై ఎస్ ఎస్ విశాఖ జిల్లా డిపిఎమ్ మోహనరావు, పారిశ్రామిక వేత్త జగన్మోహనరెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ప్రధానంగా సంకల్ప ఆర్ట్ విలేజ్ చలపతిరావు నేతృత్వంలో 50 సంవత్సరాల క్రితం వండిన విధానం లో వంటలు ప్రకృతి ఆధారంగా పండిన పంటలతో వండించారు. ఈ ఆహారాన్ని అందరూ ప్రీతితో ఆరగించారు.

Use Social Media to Spread the Word about Our News

related articles