15
విశాఖపట్నం సీతంపేటలో శ్రీకృష్ణ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో సమావేశం మందిరము, అతిథి గృహ భవనమును ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. కమిటీ సభ్యులందరూ కలిసికట్టుగా గ్రామ అభివృద్ధితో పాటు వార్డు అభివృద్ధి లో కీలక పాత్ర పోషించాలని తెలియజేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా సంఘం చేస్తున్న కార్యక్రమాలు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సారిపల్లి గోవింద్, కమిటీ అధ్యక్షులు బోరా ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గంగరాజు, కమిటీ పెద్దలు వెంకటరమణ, వెంకట యాదవ్, సారిపల్లి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.