అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో నేటినుంచి మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో

by vvwnews.com

అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో నేటి నుంచి మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ఉన్న వైద్యాధికారులు, సి.హెచ్.ఓ లు, ఆరోగ్య విస్తరణ అధికారులు మరియు ఆరోగ్య పర్య వేక్షకులు మరియు క్షేత్ర స్ధాయి వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధి సమ్మె బాట పట్టిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు 105 మంది ఈరోజు విధులలో చేరడం జరిగిందని పి.హెచ్.సి లలో అన్ని వేళల అందుబాటులో ఉంటూ శాఖాపరమైన సేవలను పటిష్టంగా అమలుపరచాలని, ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు వైధ్యాదికారులకు, వైద్య సిబ్బందికి వ్యక్తిగత సెలవులను రద్దుచేసినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. డి కృష్ణమూర్తి నాయక్ గారు ఆదేశించడం జరిగింది.
జిల్లాలో మొంథా తుఫాన్ కారణంగా బారీ వర్షాలు, బలమైన గాలులు వీచే ప్రభావం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో 24X7 గంటలు మూడు షిఫ్ట్ లను ప్రణాళిక ద్వార ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటుచేయడం జరిగిందని వీటి ద్వార అత్యవసర వైద్యం అవసరమైన చోటకు తక్షణమే తరలివెళ్లి వైద్య సహాయం కొరకు వేచిఉన్న వారికి తగిన సేవలు ఏర్పాట్లు చేయడం జరుగునని మరియు వైద్యాధికారి పర్యావేక్షణ ద్వార కమేండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా పర్యవేక్షిస్తూ తక్షణ వైద్య సేవలకు తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 24X7 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండాలని అన్నారు. ముందస్తు చర్యలుగా అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా ఫార్మసిస్ట్ లు చూసుకోవాలని సూచించారు. కాన్పునకు సిద్దంగా ఉన్న గర్భిణిలను సుఖ ప్రసవాల కోసం బర్త్ వెయిటింగ్ హాల్‌కి తక్షణమే తరలించాలని, గర్భిణి స్త్రీలు, బాలింతలు, శిశువులు, అత్యంతర ప్రమాదకర కేసులను గుర్తించి సురక్షిత ప్రదేశంలో బద్రంగా ఉండునట్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. అవసరమైన గ్రామాలలో వైద్య శిభిరాలు నిర్వహించాలని సూచించారు. అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాక్సిన్ల బద్రత కోరకు విధ్యుత్ సరపర అంతరాయంనకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అవసరమైన చోట అంబులెన్స్ సౌకర్యాలు మరియు బోట్ క్లీనిక్ లను ఏర్పాట్లు చేయవలసిందిగా సూచించారు.
108 అంబులెన్స్ లు మరియు ఐ.టి.డి.ఏ అంబులెన్స్ ల ద్వార ఈరోజు మొత్తం 92 మంది గర్భిణీలను మరియు రోగులను తరలించి వైద్య సేవలను అందించడం జరిగింది. వారిలో మొదటి ప్రససవం కొరకు ఉన్న గర్భిణిలు, ప్రమాదకర గర్భిణి లు మరియు సుఖ ప్రసవం కొరకు వేచిఉన్నవారు మొతం 75 మందిని సమీప ఆసుపత్రులకు తరలించడం జరిగిందని తెలియజేసారు. పై ఆదేశాలను నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ కార్యాక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. డి కృష్ణమూర్తి నాయక్ గారు, జిల్లా కుష్టు, ఎయిడ్స్ మరియు జిల్లా క్షయ అధికారి డాక్టర్ ఎం కిరణ్ కుమార్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం కమేండ్ కంట్రోల్ రూమ్ వైద్యాధికారులు మరియు వైద్య సిబ్బంది పాల్గున్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles