41వ వార్డును పట్టించుకోని జోనల్ 5 కమిషనర్ రాము#vvwnews

by vvwnews.com

41వ వార్డును పట్టించుకోని జోనల్ 5 కమిషనర్ రాము

* పొంగిపొర్లుతున్న జ్ఞానాపురం ఎర్రిగెడ్డ

* ప్రాణ, ఆస్తి నష్టం జరిగితే పూర్తి బాధ్యత జెడ్.సి దే

* 41వ వార్డ్ వైఎస్ఆర్సిపి వార్డు అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్

మెంథా తుఫాన్ నేపథ్యంలో ముంపుకు గురవుతున్న 41 వ వార్డు జ్ఞానపురాన్ని పట్టించుకోవడంలో జోనల్ కమిషనర్ 5 బి రాము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని 41 వ వార్డు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ ఆరోపించారు. చిన్న వర్షాలకే జ్ఞానాపురం నీట మునుగుతుంది. ఎర్రిగడ్డ లో పూడికలు తొలగించడానికి అనేకమార్లు స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ జోనల్ కార్యాలయం, ఇక్కడి జెడ్ సి రాముకు ఫిర్యాదులు చేసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. గతంలో ఎర్రి గడ్డ పూడికలు తొలగించడానికి 200, 75, 75 సామర్థ్యం గల జెసిబిలు మూడు పనిచేసేవని, ప్రస్తుతం కేవలం 75 సామర్థ్యం గల జెసిబి ఒక్కటే నామమాత్రంగా పనిచేస్తుందని కోడిగుడ్ల శ్రీధర్ వెల్లడించారు. దీంతో ఎర్రగడ్డ పూడికలు అక్కడ నుండి కనీసం తొలగించడం లేదన్నారు. ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇక్కడి ప్రాంత ప్రజలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పట్టించుకోవడంలేదని వెల్లడించారు. డ్రైనేజీలు కాలువలు పొంగిపొర్లతూ డెంగ్యూ మలేరియా చికెన్ గునియా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని చెప్పారు. ప్రజలు అనారోగ్య పాలవకుండా కాపాడాల్సిన జీవీఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నారని చెప్పారు. జ్ఞానాపురంలో నూతన ప్రాంతం వల్ల తేలికపాటి వర్షం పడిన ముంపున గురవుతుండడం పరిపాటి కనుక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కేంద్రాలకు తరలించడానికి జ్ఞానాపురంలో ఒక్క పునరావస్ కేంద్రం కూడా లేదు ఇదివరకు వర్షాలు పడినప్పుడు బిషప్ కి మరీదాస్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసి ప్రజలు అక్కడికి తరలించేవారు ఇప్పుడు ప్రస్తుతం అది శిథిలావస్థలో ఉండడం వలన నిర్మాణం కొరకు విరగ్గొట్టడం జరిగింది వారం కాలనీలో కట్టినటువంటి కమ్యూనిటీ హాలు ఒక ప్రైవేటు వ్యక్తి వద్ద తాళాలు చెవులు పెట్టుకొని ఆయన సొంత పనులకు వాడుకుంటున్నారు ఈ విషయమే జానల కమిషనర్ గారిని ఎన్నిసార్లు అడిగినా మాకు సంబంధం లేదని చెప్తూ ఉన్నారు ప్రజల కోసం కఠిన కమ్యూనిటీ హాలు ప్రజలకు అందకుండా ప్రైవేటు వ్యక్తుల పరం చేయడం ఎంతవరకు సమంజసం అని కోడిగుడ్ల శ్రీధర్ ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి జ్ఞానాపురం, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ, ఎర్రగడ్డ, పొంగిపొర్లుతున్న కాలువలు పూడికలు తొలగించాలన్నారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేలా శాశ్వత చర్యలు చేపట్టాలని కోడిగుడ్ల శ్రీధర్ డిమాండ్ చేశారు.

Use Social Media to Spread the Word about Our News

related articles