గిరిజన భూములకు రక్షణ కల్పించాలి.- సాగులో ఉన్న భూములకు అటవీ హక్కుల పట్టా ఇవ్వాలి

by vvwnews.com

dt:16-10-2025
పత్రికా ప్రకటన

గిరిజన భూములకు రక్షణ కల్పించాలి.- సాగులో ఉన్న భూములకు అటవీ హక్కుల పట్టా ఇవ్వాలి

జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక DLC ఏర్పాటు చేసి
సాగులో గిరిజనులకు పట్టాలు ఇవ్వాలి

నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాల్ని 5వ షెడ్యూల్లో చేర్చాలి.

ఆర్ల గ్రామానికి ప్రత్యేక రేషన్ పాయింట్ ఏర్పాటు చేయాలి

కోరుతూ రోలుగుంట మండల మెయిన్ రోడ్డు నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ ప్రదర్శన ధర్నా నిర్వహించడం జరిగింది

వర్షం వస్తే గిరిజన గ్రామాలకు కరెంటు పోతుంది.

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మరియు ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించడం జరిగింది

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం అర్ల. పిత్రి గడ్డ. లోసింగి. పెద్ద గోరువు. గుర్రాలు బైలు. కొరుప్రోలు. ఎం పేట. పనసలపాడు. గంగవరం గ్రామానికి చెందిన ఆదివాసి గిరిజనులు 96 కుటుంబాల వారు 30 సంవత్సరాలు నుండి అటవీ భూమిలో సాగు జీడి మామిడి. అపరాలు వంటివి సాగు చేస్తున్నారు . సాగులో ఉన్న పట్టాలు ఇవ్వలేదు. ప్రత్యేకDLC అటవీ హక్కులు కమిటీ ఏర్పాటు చేసి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది

నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలు అవ్వడం వల్ల సాగులో గిరిజనులు ఉన్నారు. పట్టాలు మాత్రగిరిజనేతలు చేతిలో ఉన్నాయి. దీనివల్ల గిరిజినేత్రలు గిరిజన భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
వీరికి ప్రత్యేకమైన రక్షణ చర్యలు చేపట్టాలి.

ఆర్ల పంచాయతీ పరిధిలో గుర్రాలు బైలు.గదవ పాలెం గ్రామాలకు ప్రత్యేక రేషన్ పాయింట్ ఏర్పాటు చేయాలి.

గదవపాలెం. గుర్రాలు బైలు గ్రామాలకు వర్షం వస్తే కరెంటు ఉండడం లేదు
చీకట్లో బతుకుతున్నాము
మాకు ప్రత్యేక లైన్ ఏర్పాటు చేసి కరెంటు వచ్చేటట్లుగా చూడాలని కోరడం జరిగింది

గిరిజన గ్రామాలకు ప్రత్యేక జిల్లా కలెక్టర్ గారు ఒకరోజు రాత్రి బస ఏర్పాటు చేయాలని

నినాదాలుతో ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించడం జరిగింది.

ఎమ్మార్వో గారికి వింత పత్రం ఇవ్వడం జరిగింది

ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కే గోవిందరావు
కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఈ చిరంజీవి
గిరిజన సంఘం నాయకులు కొర్ర కొండబాబు
గేమ్మిలి చందర్రావు వివిధ గ్రామాల మహిళలు తదితరులు పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles