‘కిస్నా డైమండ్స్, గోల్డ్ జ్యువెలరీ’ షోరూం ప్రారంభం
విశాఖపట్నం, అక్టోబర్ 15, 2025: డైమండ్స్, గోల్డ్ జ్యువెలరీలో ఎంతో ప్రసిద్ధి చెందిన ‘కిస్నా డైమండ్స్, గోల్డ్ జ్యువెలరీ’ తన షోరూంను ఆర్టీసీ కాంప్లెక్స్ దరి సంపత్ వినాయక గుడి ఎదురుగా బుధవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా హరి కృష్ణ గ్రూప్ కిస్నా డైమండ్స్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఘన శ్యామ్ ధోలాకియా మాట్లాడుతూ హరి కృష్ణ గ్రూపునకు చెందిన కిస్నా 2005 నుంచి ప్రసిద్ధ ఆభరణాల బ్రాండ్ అన్నారు. దేశవ్యాప్తంగా రిటైలర్లకు విస్తృతంగా డైమండ్స్ పంపిణీ చేస్తూ దేశంలోనే అతి పెద్ద డైమండ్ జ్యువెలరీ బ్రాండ్‌గా నిలిచామన్నారు. 1992వ సంవత్సరంలో మొదటి స్టోర్‌ను సిలిగురిలో ప్రారంభించిన తర్వాత హైదరాబాద్, హిస్సార్, ఆయోధ్య, బరేలీ, రాయ్‌పూర్, ఢిల్లీ, ముంబై, జమ్ములో ప్రారంభించామన్నారు. వినియోగదారులకు సర్టిఫైడ్ ఆభరణాలను సరసమైన ధరలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నామన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 102 షోరూమ్‌లు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మొదటిది గాజువాక, రెండోది శ్రీకాకుళం, మూడోది విజయవాడ, నాలుగోది ఇదన్నారు.
ఈ సందర్భంగా ఫ్రాంచైజీ యజమాని అంబికా జ్యువెలరీ రాంబాబు మాట్లాడుతూ కిస్నా డైమండ్స్, గోల్డ్ జ్యువెలరీకి ఎంతో ఆదరణ ఉందన్నారు. గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా మేకింగ్ ఛార్జీలలో డైమండ్ జ్యువెలరీపై 75 శాతం, గోల్డ్ జ్యువెలరీపై 25 శాతం తగ్గింపు కలదన్నారు. ప్రతి కొనుగోలుపై ఉచిత కూపన్లు కలవన్నారు. అక్టోబర్ 19 నిర్వహించే లక్కీ డ్రాలో బైక్, నవంబర్ 1న నిర్వహించే లక్కీ డ్రాలో కారు గెలుపొందవచ్చన్నారు. ఈ ఈవెంట్‌ను హనూస్ ఫిలిం ఫ్యాక్టరీ ఆర్గనైజ్ చేసింది.
సందడి చేసిన మోడల్స్
కిస్నా డైమండ్స్, గోల్డ్ జ్యువెలరీ షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా సినీ నటులు రేఖా బోజ్, లావణ్య, మోడల్స్ సత్య, జయంతి సందడి చేశారు. వీరు షోరూమ్ అంతా కాసేపు కలియతిరిగారు. లేటెస్ట్ జ్యువెలరీ ఆభరణాలు తమ ఒంటిపై వేసుకొని ఫొటోలకు పోజులిచ్చారు. ఈ షోరూమ్ కస్టమర్ల ఆదరాభిమానాలతో ఎంతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.