అనకాపల్లి జిల్లా, ₹13,75,000/- విలువ గల 275 కిలోల గంజాయిని స్వాధీనం #vvwnews

by vvwnews.com

*అనకాపల్లి జిల్లా పోలీసులు*
*పత్రికా ప్రకటన*

*అనకాపల్లి జిల్లా, ₹13,75,000/- విలువ గల 275 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన చోడవరం పోలీసులు*

*అనకాపల్లి,(చోడవరం) అక్టోబర్ 13:* అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో భారీగా 275 కిలోల గంజాయి పట్టుబడిన ఘటనపై చోడవరం పోలీసులు, అనకాపల్లి సబ్-డివిజన్ డీఎస్పీ శ్రీమతి శ్రావణి గారి ఆధ్వర్యంలో, జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి దిశానిర్దేశానుసారం మీడియా సమావేశం నిర్వహించారు.

వివరాలు ఇలా ఉన్నాయి:
*A1 వంతల దేవదాస్* S/o బలరాం @ శివ, తర్లగూడ గ్రామం, వనగుమ్మ పంచాయతీ, ముంచంగిపుట్టు మండలం, ASR జిల్లా వ్యక్తి (Absconding) ఒడిశా రాష్ట్రంలోని చిత్రకొండ ప్రాంతం నుండి గంజాయి సమకూర్చాడు
*A2 చంద్రభాన్ బిష్ణోయ్,* జోధ్‌పూర్, రాజస్థాన్ (Absconding) కు పంపించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాడు.

ఈ క్రమంలో అతడు *A4 బిసోయి మోహన్ బాబు* S/o సహదేవ్ (28), *A5 బిస్సాయి విజయ్ కుమార్* S/o బిస్సాయి లైకోన్ (23), *A6 వంతల వెంకటరావు @ బుద్దు @ వెంకీ* S/o వంతల మల్లేశ్వరరావు (21) లను పైలట్లుగా ఉపయోగించుకున్నాడు.

A1 వంతల దేవదాస్ 275 కిలోల గంజాయిని TATA CURVV (Reg. No. AP40 FG 5612) వాహనంలో 8 బాగ్‌లలో ప్యాక్ చేసి, ముంచంగిపుట్టు – పాడేరు – 12వ మైలు రాయి – కోణం మార్గం ద్వారా చోడవరం వైపు తరలిస్తుండగా, 12-10-2025 న సాయంత్రం సుమారు 4.00 గంటల సమయంలో చోడవరం పోలీసులు పట్టుకున్నారు.

దీని నేపథ్యంలో చోడవరం పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 241/2025 U/S 20(b)(ii)(C), Sec.25 r/w 8(c) of the N.D.P.S. Act కింద కేసు నమోదు చేసి, 13-10-2025 న నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు పంపించారు.

ఈ ఆపరేషన్‌ను అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి మార్గదర్శకత్వంలో, సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీమతి శ్రావణి గారి ఆధ్వర్యంలో, చోడవరం సీఐ పీ.అప్పలరాజు, ఎస్ఐలు బి.నాగ కార్తీక్, బి.జోగారావు మరియు వారి సిబ్బంది ఆధునిక సాంకేతిక సహకారంతో విజయవంతంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు మాట్లాడుతూ — “గంజాయి మరియు ఇతర డ్రగ్స్ కు సంబంధించిన నేరాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు. యువత డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. డ్రగ్స్ సరఫరా లేదా వాడకానికి సంబంధించిన ఏ సమాచారం తెలిసినా ప్రజలు పోలీసులకు తెలియజేయాలి” అని విజ్ఞప్తి చేశారు.

*ముద్దయిల వివరాలు:*
*A1. వంతల దేవదాస్* S/o బలరాం @ శివ, తర్లగూడ గ్రామం, వనగుమ్మ పంచాయతీ, ముంచంగిపుట్టు మండలం, ASR జిల్లా — (Absconding)
*A2. చంద్రభాన్ బిష్ణోయ్,* జోధ్‌పూర్, రాజస్థాన్ — (Absconding)
*A3. కొచ్చం సురేంద్ర @ గురు,* S/o లైచోన్, కారు డ్రైవర్, మేహ్బ గ్రామం, మాకవరం పంచాయతీ, ముంచంగిపుట్టు మండలం, ASR జిల్లా — (Absconding)
*A4. బిసోయి మోహన్ బాబు* S/o సహదేవ్, 28 సంవత్సరాలు, ST వాల్మీకి, కుంబిరిపాడ గ్రామం, మాకవరం పంచాయతీ, ముంచంగిపుట్టు మండలం, ASR జిల్లా — (Arrested)
*A5. బిస్సాయి విజయ్ కుమార్* S/o బిస్సాయి లైకోన్, 23 సంవత్సరాలు, ST వాల్మీకి, ఆటో డ్రైవర్, కుంబిరిపాడ గ్రామం, మాకవరం పంచాయతీ, ముంచంగిపుట్టు మండలం, ASR జిల్లా — (Arrested)
*A6. వంతల వెంకటరావు @ బుద్దు @ వెంకీ* S/o వంతల మల్లేశ్వరరావు, 21 సంవత్సరాలు, ST కోందు, వ్యవసాయం, తర్లగూడ గ్రామం, వనగుమ్మ పంచాయతీ, ముంచంగిపుట్టు మండలం, ASR జిల్లా — (Arrested)

*స్వాధీనం చేసుకున్న వస్తువులు:*
1. తెలుపు రంగు ప్లాస్టిక్ గొనె మూటల్లో ప్యాక్ చేసిన 275 కిలోల గంజాయి
2. TATA CURVV కార్ (Reg. No. AP40 FG 5612)
3. Pulsar బైక్ (Reg. No. AP31 ET 0858) — (A5)
4. Pulsar బైక్ (Reg. No. AP31 DC 3111)
5. Samsung Android Folding మొబైల్ (A4)
6. Vivo లైట్ బ్లూ Android మొబైల్ (A4)
7. realme Dark Grey Android మొబైల్ (A5)
8. Vivo Dark Metallic Green Android మొబైల్ (A5)
9. realme లైట్ పర్పుల్ Android మొబైల్ (A6)
ఈ మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు, సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీమతి శ్రావణి గారు, చోడవరం సీఐ పీ.అప్పలరాజు, ఎస్ఐలు నాగ కార్తీక్, జోగారావు మరియు పోలీస్ సిబ్బందిని అభినందించారు.

*జిల్లా పోలీస్ కార్యాలయం,*
*అనకాపల్లి.*

Use Social Media to Spread the Word about Our News

related articles