ఘనంగా అమ్మవారి దేవర దివిటి సంబరాలు* *పాల్గొన్న 14 గ్రామాలు* #vvwnews

by vvwnews.com

*ఘనంగా అమ్మవారి దేవర దివిటి సంబరాలు*

*పాల్గొన్న 14 గ్రామాలు*

భీమిలి,న్యూస్ లీడర్ అక్టోబర్ 10:

అనాదిగా వస్తున్న చిప్పాడ కనకమ్మవారి దేవర దివిటీ సంబరాలు గురువారం అర్ధరాత్రి ప్రారంభమయ్యాయి.
భీమిలి మండలం చిప్పాడ కొండ వద్ద కొలువై ఉన్న కనకమ్మవారి జాతర సందర్బంగా గురువారం అర్ధరాత్రి దేవర కార్యక్రమం లో భాగంగా దివిటీ సంబరం జరిగింది.ఈ కార్యక్రమంలో 14 గ్రామాల ప్రజలు తమ ఆచారంలో భాగంగా ప్రతి ఒక్కరూ దివిటీలు పట్టుకుని అర్ధరాత్రి అమ్మవారి గుడికి చేరుకున్నారు.దీంతో వారి కుటుంబాలలో కష్టాల తొలగిపోయి అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉంటారని నమ్మకం.కొన్ని వందల ఏళ్లుగా ఈ ఆచారం 14 గ్రామాలు ప్రజలు ఆచరిస్తున్నాయి.ఈ సందర్బంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గురువారం అర్ధరాత్రి మొదలయిన ఈ సంబరం శుక్రవారం తెల్లవారుజాము వరకు కొనసాగింది.అమ్మవారిని గుడి నుండి చిప్పాడ పుర వీధుల్లో ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు కుంకుమలు సమర్పించి శుక్రవారం సాయంత్రం అమ్మవారిని గుడికి చేర్చి హారతి సమర్పించి అనుపు కార్యక్రమం జరిపిస్తారు.

Use Social Media to Spread the Word about Our News

related articles