*లారీ సప్లయర్స్, ఓనర్స్ సమస్యలను పరిష్క రించాలి*
లారీ సప్లయర్స్, ఓనర్స్ సమస్యలను పరిష్క రించాలని విశాఖ ట్రాన్స్పోర్ట్ సప్లయర్స్ ఎలియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ పౌర గ్రంథాలయంలో బుధవారం వీడిఎల్ఎస్ఎ ఐక్యవేదిక ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 40 ఏళ్లుగా విశాఖ జిల్లాలో 500 ట్రాన్స్ పోర్ట్ ఆఫీసులు, ప్రత్యక్షంగా పరోక్షంగా 15,000 మందితో జీవన ఉపాధి సాగిస్తున్నా మని వెల్లడించారు తామంతా ఒకే తాటిపై జేఏసీగా ఏర్పడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు బల్క్ మెటీరియల్స్ పై ఒక శాతం మార్జిన్ అమలు చేయాలని కోరారు లోడింగ్ అన్ లోడింగ్ చార్జెస్ పూర్తిగా ఎత్తి వేయాలని రిసివెడ్ చార్జెస్ పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో జేఏసీ డిమాండ్ల పరిష్కరించే వరకు పోరాటం సాగిస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమం లో వైస్ చైర్మన్ ఆర్ భాస్కర్, కార్యదర్శి బి సూర్యప్రకాశ రావు,ట్రెజరర్ వి. వెంకటేశ్వర రావు,జాయింట్ సెక్రెటరీ పి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.