*త్వరలోనే గూగుల్ డేటా సెంటర్ కావాలని కోరుకుంటున్నా లక్ష మంది నిరుద్యోగ యువత మద్దతుతో భారీ ప్రదర్శన.రాష్ట్ర అభివృద్ధిని, యువత ఉద్యోగ ఉపాధిని అడ్డుకుంటే చరిత్రహీనులవుతారు తస్మాత్ జాగ్రత్త.రైతుల ముసుగులో వైసిపి నాయకులు గూగుల్ డేటా సెంటర్ ను అడ్డుకోవడానికి వేస్తున్న కేసులను ,వేలాదిమంది యువత మద్దతుతో వ్యతిరేకిస్తాం. రాష్ట్ర యువత నారా లోకేష్ కృషితో చేస్తున్న ఐటీ పరిశ్రమల ఏర్పాటు,ఉద్యోగ కల్పన,అభివృద్ధికి ఆకర్షితులై ఉన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోము అని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ అన్నారు .నారా లోకేష్ గారి పనితీరు తో గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందుతారని అక్కసుతో, గూగుల్ డేటా సెంటర్ ను వైసిపి వారు అడ్డుకుంటున్నారు, ఇప్పటికే మెగా డీఎస్సీ ఇచ్చి 15,941 ఉద్యోగాలు తొలి సంతకంతో భర్తీ చేసి ,నిరుద్యోగుల గుండెల్లో నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు నిలిచిపోయారు* అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపెనీ, బొబ్బట్లు కంపెనీ, అప్పడాలు, పచ్చళ్ళు కంపెనీ, మామిడి తాండ్ర కంపెనీలతో ఎం ఓ యు చేసుకొని యువతకి ఉద్యోగాలు ఇప్పిస్తామని గత వైసిపి మంత్రి అమర్నాథ్ గతంలో అసెంబ్లీలో చెప్పారు. దీంతో యువత ఆయనను హేళన చేశారు. ఆయన అసమద్రత బయట పడిపోతుందని భయంతో, ఇప్పటి ఐటీ మంత్రి నారా లోకేష్ కు అత్యంత ఆదరణ గూగుల్ డేటా సెంటర్ మరియు ఇతర ఐటీ కంపెనీల ప్రారంభంతో వచ్చేస్తుందని, కనుక వాటిని వైసిపి కుళ్ళుబుద్ధితో అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ అన్నారు. వైసిపి మాజీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపెనీ తెస్తే, ఇప్పటి ఐటీ మంత్రి నారా లోకేష్ కాగ్నిజెంట్ మరియు టిసిఎస్ తీసుకువచ్చారు. అమర్నాథ్ బొబ్బట్లు కంపెనీ తెస్తే, నారా లోకేష్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయాన్ని విశాఖకు రప్పించారు. అమర్నాథ్ అప్పడాలు పచ్చళ్ళు కంపెనీలతో ఎం ఓ యు చేసుకుంటే, నారా లోకేష్ గూగుల్ డేటా సెంటర్ సిఫీ సత్వ టెక్నాలజీస్ తో పాటు, విశాఖ హుడా కాంప్లెక్స్ లో 11 అంతస్తుల డెక్ ను ఐటి కంపెనీల ప్రారంభ దశలో ఉపయోగించడానికి బిల్డింగును ప్రారంభించారు.
త్వరలోనే గూగుల్ డేటా సెంటర్ కావాలని కోరుకుంటున్నా లక్ష మంది నిరుద్యోగ యువత మద్దతుతో
16