బాధితులపైనే తప్పుడు కేసులు:
వైయస్ జగన్ని చూసి చంద్రబాబు ఎంతలా భయపడిపోతున్నాడో చెప్పడానికి పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా గత పది రోజులుగా ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలే నిదర్శనాలు. ఎన్నికలు ప్రశాంతంగా ప్రశాంత వాతావరణంలో జరిగితే తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఖాయమని తెలుసు కాబట్టే పక్క జిల్లాల నుంచి టీడీపీ గూండాలను కడపలో మోహరించి స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈనెల 6వ తేదీన నల్లగొండువారిపాలెం అనే గ్రామంలో వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, పార్టీ నాయకుడు వేల్పుల రాము(రామలింగారెడ్డి), వెంకటాద్రిరెడ్డి ప్రయాణిస్తున్న కారును అడ్డగించిన టీడీపీ గూండాలు విచక్షణారహితంగా వారి కారును ఇనుప రాడ్లు, కర్రలతో ధ్వంసం చేయడమే కాకుండా వారిపైన కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆనక కారు మీద పెట్రోల్ పోసి వారిని అంతం చేయాలని చూశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు పోలీసులకు మొరపెట్టుకున్నా టీడీపీకి చెందిన ఏ ఒక్కర్నీ అరెస్ట్ చేయలేదు సరికదా కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. కానీ దాడి జరిగిన అదే 6వ తేదీన ధనుంజయ్ అనే టీడీపీ కార్యకర్తను కులం పేరుతో ధూషించినట్టు బాధితులైన వైయస్సార్సీపీ నాయకుల మీదనే పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారు. ఆరో తేదీన ధనుంజయ్ అనే వ్యక్తి ఫిర్యాదు ఇచ్చినట్టు ఈ మేరకు వేల్పుల రాము, వెంకటాద్రిరెడ్డి ల మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నెంబర్ 455 తో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎస్సీల రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాన్ని చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాడు. తెలుగుదేశం గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన రమేశ్ యాదవ్, వేల్పుల రాము, వెంకటాద్రిరెడ్డి ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా ఏకంగా బాధితులపైనే తప్పుడు కేసు నమోదు చేయించిన దుర్మార్గుడు చంద్రబాబ
-టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే