రవాణాశాఖ అధికారులు పెడుతున్న కేసులు వెంటనే ఆపాలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి డిమాండ్

by vvwnews.com

ప్రెస్ నోట్ స్కూలు పిల్లలు ఆటోలపై పోలీసులు రవాణాశాఖ అధికారులు పెడుతున్న కేసులు వెంటనే ఆపాలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి డిమాండ్ విశాఖలో స్కూలు పిల్లల ఆటోలపై పోలీసు వారు పెడుతున్న కేసులు ఎఫ్ఐఆర్ వేసి కోర్టులో డ్రైవర్లను కోర్టులో హాజరపరిచే డ్రైవర్లకు జీవన ఉపాధి లేకుండా చేయొద్దని అధికారులు కోరారు ఆటో డ్రైవర్ల పై పోలీసు రవాణాశాఖ అధికారులు పోటీపడి పెడుతున్న కేసులను వెంటనే ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తేదీ 29 3 2025 ఉదయం 9 గంటలకి జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర మండుట ఎండని లెక్కచేయకుండా వందలాది మంది ఆటో డ్రైవర్లు నిరసన ధర్నా చేశారు ఈ కార్యక్రమం ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామన మూర్తి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలోకొస్తే ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర 15 వేల రూపాయలు ఇస్తామని జరిమానాలు పెంచే జీవో నెంబర్ 21 31 రద్దు చేస్తామని డ్రైవర్లకు వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ 10 లక్షలు అమలు చేస్తామని హామీ ఇచ్చి తొమ్మిది నెలలు గడిచిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు విశాఖ పోలీస్ కమిషనర్ గారు ఓవర్ లోడ్ చేస్తున్న స్కూల్ పిల్లల ఆటో డ్రైవర్ల పై కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ లేసి డ్రైవర్లను కోర్టులో పెట్టాలన్న ఆదేశాలను పున్నారా పరిశీలించాలని కోరారు ఇప్పటికే పెరిగిన డీజిల్ పెట్రోలు వంట గ్యాస్ నిత్యవసర వస్తువులు ధరలతో రోజంతా ఆటో నడిపిన పూటకడవని ఆటో డ్రైవర్లకు పోటీగా ఓలా ఉబర్ రాపిడి వాహనాలు వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు ఆదాయం కోల్పోయి ఇల్లు అద్దెలు కరెంట్ బిల్లులు చెల్లించలేక కనీసం పిల్లలకు కడుపునిండా అన్నం కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్న స్కూల్ పిల్లల ఆటో డ్రైవర్ల పై పోలీసులు రవాణా శాఖ అధికారులు పోటీపడి నిబంధనలు పేరుతో కేసులు పెట్టి వేల రూపాయలు జరిమానాలు ఇస్తే డ్రైవర్ ఎలాగా బ్రతకాలో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు స్కూల్ ఆటోలో పదో తరగతి విద్యార్థిని 10 మందిని ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎనిమిది మంది ఆటో తిప్పెందుకు అనుమతి ఇవ్వాలని స్కూల్ పిల్లలు ఆటో డ్రైవర్ కి ఇస్తున్న జీతాలు పెంచి డ్రైవర్ల జీవనోపాధికి రక్షణ కల్పించాలని అధికారులు కోరారు ఆటో డ్రైవర్ల పై ఎఫ్ఐఆర్ లేసి కోర్టులో పెడితే ఆదాయం కోల్పోయి ఆటో డ్రైవర్ల మానసిక ఆందోళన గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు ఎవరైనా ఆటో ఓవర్ లోడ్ చేస్తే పోలీసు వారు ఫైన్ వేసి ఆటోలు విడుదల చేయాలని కోరారు ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పడాల గోవింద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఆటో డ్రైవర్ కి ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని వాహన మిత్ర 15000 రూపాయలు ఇవ్వాలని జీవో నెంబర్ 21 31 రద్దు చేయాలని ఆటోలు నగర పర్మిట్లు వెంటనే ఇవ్వాలని నగరంలో ఆటోలు వ్యానులు కు స్టాండ్ లో పార్కింగ్ స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన యాప్ ఓలా ఊబర్ రాపిడి నగర పరిధిలో నిషేధించి డ్రైవర్లకు జీవన ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఆటో డ్రైవర్ల అండ్ మోటార్ వాహన కార్మికుల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు ఆటో నగర పోలీస్ కమిషనర్ గారు రోడ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కలెక్టర్ గారితో జాయింట్ మీటింగ్ వేసి ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులపై పోలీస్ రవాణా శాఖ అధికారులు పెడుతున్న కేసులను ఆపి డ్రైవర్లకు జీవనోపాధి కల్పించాలని కోరారు లేనిపక్షంలో ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ కే రెహమాన్ అడ్డూరి శంకరు యు శివాజీ దేవుడు ఈశ్వర్ చంటి నాని వేణు వందలాది మంది డ్రైవర్లు పాల్గొన్నారు ఇట్లు పడాల గోవిందు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ విశాఖపట్నం

Use Social Media to Spread the Word about Our News

related articles