పర్యావరణాన్ని పరిరక్షించండి
– మన జల వనరులను మనమే కాపాడుకోవాలి.
– ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వద్దే వద్దు.
– మన ఇంటి వ్యర్థాలను మనమే ఆదాయవంతంగా నిర్మూలించుదాం.
– జెవి రత్నం. వ్యవస్థాపక కార్యదర్శి. గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో.
పర్యావరణాన్ని పరిరక్షించండి అవి గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నేతృత్వంలో, సస్టైనబుల్ రీజిలియన్స్ యూనిట్ – జివిఎంసి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ ల నేతృత్వంలో మద్దిలపాలెం అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిరమైన నీటి వనరులు సాధన, ప్రభుత్వం నిషేధించిన 16 రకాల ప్లాస్టిక్ వినియోగించ వద్దు, ఎవరి ఇంటి వ్యర్ధాలను వారే ఆదాయవంతంగా నిర్మూలించాలని కోరుతూ ఎపిపిసిబి ప్రచార కార్యక్రమాలు నిర్వహాస్తోంది అని ఆయన వివరించారు. ఎకో వైజాగ్ ను జయప్రదం చేయాలని, ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రోటరేక్ట్ క్లబ్ వైజాగ్ రోయల్స్ సభ్యురాలు చాందిని మాట్లాడుతూ మన జల వనరులను మనమే కాపాడుకోవాలని కోరారు. ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వద్దే వద్దని ప్రతి ఒక్కరూ ప్రతిన బూని ముందుకు సాగాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం తాము కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగుతోంది అన్నారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి రామ్ అప్పారావు, పలువురు విద్యార్థులు మాట్లాడారు.
పర్యావరణాన్ని కాపాడుకుందాం అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ & గ్రీన్ క్లైమేట్ టీం
46