పర్యావరణ దినోత్సవాల క్యాలెండర్ అందరికీ అవసరం.
– ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలి.
– పర్యావరణ పరిరక్షణ దినోత్సవాలను ప్రతి విద్యా సంస్థలో నిర్వహించాలి
– ముకుంద. రీజనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్. ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి.
పర్యావరణ దినోత్సవాల క్యాలెండర్ అందరికీ అవసరం అని ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ ముకుంద పేర్కొన్నారు. బుధవారం ఉదయం విశాఖపట్నం లోని ఎపి కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ ముద్రించిన పర్యావరణ పరిరక్షణ దినోత్సవాల క్యాలెండర్ ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి, భారత ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న పర్యావరణ పరిరక్షణ రోజులన్నీ ఈ క్యాలెండర్ లో ఉన్నాయి కాబట్టి విద్యా సంస్థల్లో ఈ క్యాలెండర్ ఉంచుకోవాలి, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరారు. ప్రధానంగా పూర్వీ రజాక్ పర్యావరణ పరిరక్షణ కోసం వేసిన చిత్రం అందర్నీ ఆలోచింపజేసే విధంగా ఉంది అన్నారు.ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలి. పర్యావరణ పరిరక్షణ దినోత్సవాలను ప్రతి విద్యా సంస్థలో నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఎపి పిసిబి ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యావరణ దినోత్సవ క్యాలెండర్ విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు బాగా ఉపకరిస్తుంది అన్నారు. ప్రతి విద్యార్థి ఈ పర్యావరణ దినోత్సవం క్యాలెండర్ లోని రోజులు గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎపి పిసిబి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ సూర్య కళ, ఆంధ్రా యూనివర్సిటీ రీసెర్చర్ రంగాచార్యులు, వనమాలి గార్డెనర్స్ అడ్మిన్ అరవల అరుణ కుమారి, సిటిజి అడ్మిన్ మళ్ల సరిత, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, కోఆర్డినేటర్ లు ఐ కృష్ణ కుమారి, జె రవితేజ , గ్రీన్ వాలంటీర్ జె రాజేశ్వరి తదితరులు పాల్గొని మాట్లాడారు.
పర్యావరణ దినోత్సవాల క్యాలెండర్ అందరికీ అవసరం.ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలి.
48