విశాఖపట్నం ద్వారకానగర్ బీవీకే కాలేజీ పూర్వవిద్యార్థులు తీవ్ర సంతాపం..! #vvwnews

by vvwnews.com

100 సినిమాల‌కు పైగా జ‌న‌రంజ‌క‌మైన పాట‌లు రచించిన కులశేఖర్ మరణం పట్ల విశాఖపట్నం ద్వారకానగర్ బీవీకే కాలేజీ పూర్వవిద్యార్థులు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన కులశేఖర్ సంస్మరణార్ధం బీవీకే కాలేజీ పూర్వవిద్యార్థులు శనివారం కాలేజీ భువనవిజయం సమావేశమందిరంలో సంతాప సభ నిర్వహించారు. వందలాదిమంది కులశేఖర్ సహచర విద్యార్థులు, పూర్వ విద్యార్థులు హాజరై కులశేఖర్ తో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. చిన్నప్పటి నుంచి కులశేఖర్ కు సంగీత సాహిత్యాల మీద ఆసక్తి ఉండేదని, చదువుకుంటున్న రోజుల్లోనే పాటలు రాసి అనేక బహుమతులు పొందారని సహచర విద్యార్థులు తెలిపారు. చదువు తర్వాత ఈనాడు గ్రూపులో జర్నలిస్టుగా సేవలందించారని తర్వాత తేజ దర్శకత్వంలో ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన చిత్రం సినిమాతో గేయ రచయితగా పరిచయం అయ్యారని గుర్తుచేసుకున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి దగ్గర శిష్యరికం చేస్తూ సినీ గీతాల రచనలో మెళుకువలు నేర్చుకుని
గీత రచయితగా అనేక విజయవంతమైన సినిమాలకు పాటలు రాసినట్లు సన్నిహితులు తెలిపారు.ఈ కార్యక్రమం కి ముఖ్య అతిథిగా విచ్చేసిన భారతీయ విద్యా కేంద్రం చైర్మన్ నాగేశ్వరరావు గారు, కోశాధికారి శ్రీధర్ గారు, బీజేపీ Ex Mlc మాధవ్ గారు, సత్య రావు గారు రిటైర్డ్ పొలిటికల్ అధ్యాపకులు, పిల్ల రమణమూర్తి గారు సాంస్క్రిట్ ఉపాధ్యాయులు, కృష్ణాచారి గారు, రత్న శేఖర్ ప్రిన్సిపల్ BVk ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొని కులశేఖర్ కి సంతాపం తెలియజేశారు సున్నిత మనస్కుడైన కులశేఖర్ మరణం తమకు తీరని లోటని పూర్వవిద్యార్థులు సంతాపం తెలిపారు.

Use Social Media to Spread the Word about Our News

related articles