నితీష్ రెడ్డికి మెల్‌బోర్న్ ఆస్ట్రేలియాపై మన తెలుగువాడు తొలిమ్యాచ్‌లో తొలి సెంచ‌రీ సాధించడం అద్భుతం

by vvwnews.com

*వైజాగ్ క్రికెట‌ర్ నితీష్ రెడ్డికి అనకాపల్లి ఎం.పీ అభినంద‌న.*

*మెల్‌బోర్న్ వేదిక‌గా ఆస్ట్రేలియాపై మన తెలుగువాడు తొలి మ్యాచ్‌లో తొలి సెంచ‌రీ సాధించడం అద్భుతం*

*ఆస్ట్రేలియా గడ్డపై అతిపిన్న వయసులో సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా రికార్డ్ సాధించడం సంతోషం.*

*ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఈ సంవత్సరం గుర్తుండిపోయేలా చేసిన నితీష్ రెడ్డి కు ఉత్తరాంధ్ర తరపున శుభాభినందనలు.*

*తండ్రి త్యాగానికి ఫలితం ఏంటో యావత్ దేశం అంతా ఈరోజు ముత్యాల రెడ్డి వైపు చూసింది అంటూ ప్రశంసలు కురిపించిన రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్.*

బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరుగుతోన్న నాలుగో టెస్టులో విశాఖపట్నం యువకుడు నితీశ్ రెడ్డి సెంచరీ సాధించడం పట్ల అనకాపల్లి ఎం.పీ డాక్టర్ సి.ఎం రమేష్ అభినందనలు తెలియజేసారు.టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో వచ్చి అద్భుతమైన బ్యాటింగ్‍తో ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న నితిశ్ రెడ్డి ఆట తీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది అన్నారు.ఫాలోఆన్ ప్రమాదంలో ఉన్న భారత్‍ను అద్భుత శతకంతో ఆదుకొని చిరస్మరణీయ సెంచరీ సాధించిన నితీష్ రెడ్డి ఆట తీరు పట్ల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఎంతగానో గర్వించిన సందర్భం అని పేర్కొన్నారు.ఆసీస్ గడ్డపై అతిపిన్న వయసులో సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా రికార్డ్ సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.తీవ్ర ఒత్తిడిలోనూ ఏకాగ్రతను కోల్పోకుండా తొలి శతకం పూర్తి చేసినందుకు అభినందనలు. నితీశ్ ఆటపై గర్వంగా ఉంది. ఇలానే మున్ముందూ కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్బంగా నితీష్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.ఎన్నో కష్టాలు అనుభవించి,త్యాగాలు చేసిన తండ్రి పట్ల గర్వంగా ఉంది అని తండ్రి త్యాగానికి ఫలితం ఏంటో యావత్ దేశం అంతా ఈరోజు ముత్యాల రెడ్డి గారి వైపు చూసింది అని కొనియాడారు.నితీష్ రెడ్డి భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని భారత జట్టులో కొనసాగి కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేయాలని భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ ప్రదర్శనలతో భారత జుట్టుకు విజయాలు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలియజేశారు.

*అనకాపల్లి ఎం.పీ క్యాంపు కార్యాలయం,*
*పూడిమడక రోడ్, అనకాపల్లి.*

Use Social Media to Spread the Word about Our News

related articles