హెక్సటాస్ఫియర్ టెక్నాలజీస్  ప్రారంభం #vvwnews #news #latestnews

by vvwnews.com

సీతమ్మధారలో  అక్షయ గ్రూప్  ప్రతిష్ఠాత్మక సంస్థ హెక్సటాస్ఫియర్ టెక్నాలజీస్  ప్రారంభం అయ్యింది. ఆధునిక సాంకేతిక కేంద్రాన్ని ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ వేపాడ చిరంజివి ప్రారంభించారు.  ఈ సందర్బంగా ఎమ్మెల్సీ చిరంజివి మాట్లాడుతూ
ఐటీ మరియు ఇంజినీరింగ్ సేవలలో ప్రత్యేకత కలిగిన ఈ సంస్థ అని చెప్పారు.చంద్రబాబు, లోకేష్ కృషి వలన రాష్ట్రానికి పెట్టుబడులు తరలి వస్తున్నాయిని చెప్పారు. ఐటి కి గేట్ వే లాంటి సంస్థలు మరలా రాష్ట్రంలో తిరిగి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయిని కొన్ని వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.
అనంతరం హెక్సటాస్ఫియర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్లు శ్రీనివాసరావు వవిలపల్లి,  శ్రవణ్ లక్షినేని మాట్లాడుతూ  విభిన్న పరిశ్రమలకు నూతనతను తీసుకురావడమే కాకుండా, అత్యుత్తమ సేవలందించడంపై దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. పరిశోధన, అభివృద్ధి, కొత్త ఆవిష్కరణల ద్వారా పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడటమే సంస్థ లక్ష్యం అని చెప్పారు వ్యాపార ప్రపంచానికి అందించబోయే సేవలను వివరించారు.కార్యక్రమంలో నాస్కామ్ డైరెక్టర్ పూజ శంకర్, అడెప్ట్ టెక్నాలజీస్ సీఈఓ మదన్ మోహన్ లోలుగు తదితరులు పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles