స్వామివారిని దర్శించుకున్నదేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి

by vvwnews.com

శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం.
తేదీ 15 డిసెంబర్ 2024

స్వామివారిని దర్శించుకున్న
దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి

పూర్ణకుంభ స్వాగతం పలికిన
దేవాదాయ కమిషనర్ శ్రీరామ సత్యనారాయణ ఆలయ కార్యనిర్వహణాధికారి వెండ్ర త్రినాధ రావు

ఆదివారం సాయంకాలం శ్రీ వరహా లక్ష్మీ నరసింహ స్వామి వారిని దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి దర్శించుకున్నారు వీరికి దేవాలయ కమిషనర్ శ్రీరామ సత్యనారాయణ ధ్వజస్తంభం వద్ద పూర్ణకుంభ స్వాగతం పలికి ఆహ్వానించారు ఆలయ కార్య నిర్వహణ అధికారి వెండ్ర త్రినాధరావు వేద పండితులు నాదస్వర వేద మంత్రాలతో స్వాగతం పలికి ముందుగా స్వామివారి కప్పస్తంభం ఆలింగణం కావించి తదుపరి బెడ మండపం ప్రదక్షణ చేయించి ఆలయ ప్రధాన ఆలయం లో స్వామివారి వద్ద గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేసి అనంతరము అమ్మవారి నీ దర్శించి అనంతరము నాదస్వర వేదమంత్రాలతో వేద ఆశీర్వచనం ఇచ్చి దేవాదాయ కమిషనర్ రామసత్యనారాయణ మంత్రివర్యులను స్వామివారి శేష వస్త్రముతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు స్వామివారి చిత్రపటాన్ని బహకరించారు
తదుపరి దేవాలయ కమిషనర్ వారిని ఆలయ కార్యనిర్వహణాధికారి వారు సత్కరించి స్వామివారి ప్రసాదాలు స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు
వీరితో స్థానిక కార్పొరేటర్ పీవీ నరసింహం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు రాంబాబు సహాయకారి నిర్వహణ అధికారి రమణమూర్తి ఆలయ సహాయ కార్య నిర్వహణ అధికారి ఎన్ ఆనంద్ కుమార్ పర్యవేక్షణ అధికారి సునీల్ విక్రమ్ పి.ఆర్.ఓ నాయుడు తదితరులు ఉన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles