విశాఖ లో ఎన్ టి ఆర్ వజ్రోత్సవము వేడుకలు *ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విశాఖ జిల్లా కో-ఆర్డినేటర్ గా పూతి వెంకట రెడ్డి*విశాఖపట్నం, డాబాగార్డెన్స్ 14 : ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖలో పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా ఫిలిం సాంబార్స్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ జ్యోతి ప్రజ్వలనతో మొదలుపెట్టి విశ్వ విఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ విశాఖ జిల్లా కోఆర్డినేటర్ గా పూతి వెంకటరెడ్డికి బాధ్యతలు అప్పగించి, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఫిలిం ఛాంబర్ కార్యవర్గ సభ్యులు ఆయనకు సన్మానం చేశారు, ఈ సందర్భంగా కో -ఆర్డినేటర్, పూతి వెంకటరెడ్డి మాట్లాడుతూ మద్రాసులో తెలుగు సినిమా పరిశ్రమ ఉన్న తొలినాళ్లలో శ్రీ నందమూరి తారక రామారావు, మనదేశం సినిమాలో ఒక చిన్న బ్రిటిష్ పోలీసు పాత్ర తో నటుడిగా, తెలుగు సినీ రంగప్రవేశం చేసి, ఆ తర్వాత తన నటనా ప్రతిభతో ఎన్నో రకాల పాత్రలు పోషించి, ఆ పాత్రలు ఆయన తప్ప వేరే ఎవ్వరూ పోషించలేరు అని నిరూపించుకొని, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకొని, తెలుగు చిత్రపరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్! ఆయన మనదేశం సినిమాతో సినీ అరంగ్రేటం చేసి 75 సంవత్సరాలు దాటిన సందర్భంగా అలాంటి మహానుభావుని గొప్పతనాన్ని స్మరించుకొనుటకు “ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టి. డి.జనార్దన్” పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, అధ్యక్షుడు, ఏ.యం రత్నం,ప్రధాన కార్యదర్శి, జె.వి.మోహన్ గౌడ్ మరియు కమిటీ సభ్యుల ఆదేశాల మేరకు రాష్ట్రంలో జిల్లాల వారీగా కోఆర్డినేటర్ ఆధ్యర్యంలో ఎన్టీఆర్ 75 ఏళ్ల సినీ వజ్రోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నాం అని తెలిపారు. ఇదే రోజున ఆయన పైన విశాఖపట్నం భాద్యతలు “ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్” తన పైన నమ్మకంతో విశాఖ జిల్లా కో-ఆర్డినేటర్ గా ఫిల్మ్ ఛాంబర్ లో తనకు అవకాశం కల్పించిన రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. తన పైన ఉన్న ఈ అపర మైన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సినీ పరిశ్రమకు తన వంతు సేవలు అందిస్తానని, సినీ పరిశ్రమల్లో కష్టాలు ఎదుర్కొనే వారికి తనదైన శైలిలో, అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ యొక్క కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలు, అధ్యక్షులు, ఎ.యం.రత్నం, కార్యదర్శి జె.వి.మోహన్ గౌడ్ ఆదేశాలు మేరకు నిర్వహించామని తెలిపారు! ఈ యొక్క కార్యక్రమంలో జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి, గంట్ల శ్రీనుబాబు,ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి,జి. శ్రీనివాసరావు, ఏపీ బి జె ఏ అధ్యక్షుడు, ఈరోతి ఈశ్వరరావు, ఎన్ యస్.మూర్తి రాష్ట్రా సంయుక్త కార్యదర్శి, ఎండీ.భాష, ఉపాధ్యక్షులు, సత్యనారాయణ రాజు, అల్లూరి జిల్లా కో- ఆర్డినేటర్,శ్రీనివాస్, అనకాపల్లి కో -ఆర్డినేటర్, పీ.వీ. మూర్తి,శ్రీకాకుళం, డా.పూతి వెంకట్ రెడ్డి, సింగర్,డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు, జర్నలిస్ట్,ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ నిర్మాతల మండలి సభ్యులు విశాఖపట్నం కో ఆర్డినేటర్ గా,యమ్.కృష్ణ కిషోర్ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (ఆంధ్రప్రదేశ్) ఉపాధ్యక్షుడు,కోరియోగ్రాఫర్,సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ దర్శకులు, యన్ ఏ డి వెంకటేష్, నటుడు, దర్శకుడు, బోనెల రవి, ఫైట్ మాస్టర్ జానీ నటుడు కాస్ట్యూమ్ డిజైనర్ రమేష్ యాదవ్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యనిర్వాక కార్యదర్శి జర్నలిస్ట్ వై. రాజశేఖర్ జి . విజయలక్ష్మి, జి. సౌమ్య, సాయి సంతోష్, సీనియర్ జర్నలిస్ట్, వెంకటరమణ, నటి నటులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
49
previous post