వికసిత భారతంలో ఆంధ్రప్రదేశ్ చిరునవ్వులు విరబూయాలి
• విధ్వంసం నుంచి విజయ తీరాలకు రాష్ట్రం పురోగమించాలి
• క్షేత్ర స్థాయి నుంచి పైస్థాయి వరకు సమష్టి కృషి అవసరం
• అధికార గణం వారి బలాన్ని వారే తెలుసుకోవాలి
• వ్యవస్థలను బలోపేతం చేసి ప్రజలకు మేలు చేయాలి
• భవిష్యత్తను అంచనా వేయడంలో శ్రీ చంద్రబాబు గారి దూరదృష్టి అద్భుతం
• గత ప్రభుత్వం దుబారా ఖర్చులతో ప్రజా ఖజానాను విచ్ఛిన్నం చేసింది
• ప్రజలు అన్నీ
కాలంలో యువతకు ఉద్యోగాలు ఉండాలి. 2047 నాటికి సాంకేతికతతో కూడిన వ్యవసాయం వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ పెరగాలి. నాణ్యమైన విద్య, వైద్యం అందరికి అందాలి అనే గొప్ప లక్ష్యాలతో ప్రతీ ఒక్కరి అభిప్రాయాలు తీసుకుని ఈ డాక్యుమెంట్ రూపొందించారు. ఇది సాకారం చేసేందుకు క్షేత్ర స్థాయి నుంచి పైస్థాయి వరకు సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. శ్రీ చంద్రబాబు గారి విజన్ చాలా గొప్పగా ఉంటుంది. దాని కోసం ఐకమత్యంగా మనమంతా కష్టపడితే భావితరాలకు గొప్ప భవిష్యత్తును అందించవచ్చు.
• రూల్ ఆఫ్ లా బలంగా ఉండాలి
చాలా మంది పెట్టుబడుదారులు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రధాన కారణం అక్కడ రూల్ ఆఫ్ లా చాలా బలంగా ఉండటం. రూల్ ఆఫ్ లా అనేది బలంగా ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ది సాధిస్తుంది. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకునే ప్రతీ ఒక్కరికి కూడా రూల్ ఆఫ్ లా సమానంగా ఉండాలి. అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతలు బలంగా ఉండాలి. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి పెట్టుబడుదారులు తరలివస్తారు. అప్పుడు రాష్ట్రం కూడా అభివృద్ధి బాట పడుతుంది. ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వాములే. స్వర్ణాంధ్ర విజన్ 2047 ఇది ప్రతీ ఒక్కరి సమగ్ర బాధ్యత. “ప్రతి ఒక్కరి జీవితంలో సంపద రావాలి. శక్తి రావాలి. సుస్థిరత రావాలి. సమగ్రాభివృద్ధి చెందాలి” ఇదే మన సంకల్పం. ఇది మహా సంకల్పంగా మారాలి.
• మన రాష్ట్రంలో అద్భుత వనరులు ఉన్నాయి
గోవా గొప్ప పర్యటక ప్రాంతం. ఆ రాష్ట్రానికి సగం ఆదాయం పర్యటకం మీదనే వస్తోంది. మన రాష్ట్రానికి కూడా విశాలమైన తీరప్రాంతం ఉంది. గోవా కంటే అద్భుతాలు చేయగలిగే వనరులు మన దగ్గర ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఒక మాఫియా తరహా వ్యక్తులు రాష్ట్ర పర్యటకాన్ని పూర్తిగా దిగజార్చారు. రాష్ట్రానికి వచ్చే విదేశీ పర్యటకులను భయపెట్టారు. పర్యటకులకు రక్షణ కల్పించడం మన ప్రధాన బాధ్యత. మన రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన పర్యటక ప్రదేశాలు ఉన్నాయి. పర్యటకం కోసం వచ్చేవారిని సొంత మనుషుల్లా చూసుకుని, వారికి తగిన ఆతిథ్యం ఇస్తే వాళ్లు మరోసారి మన రాష్ట్రానికి పర్యటకం కోసం వస్తారు. అలాంటి గొప్ప సంస్కృతి మళ్లీ రావాలి. రాష్ట్రం పర్యటకంగా కళకళలాడాలి. టూరిజం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. దానివల్ల రాష్ట్రం పురోగమిస్తుంది. ప్రజలకు కూడా ఏదైనా విషయంలో నిరసన తెలిపే హక్కు ఉంటుంది. అయితే అది ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. మీరు ఆవేశంలో ఒక బస్సు తగలపెడితే దాని నష్టం పన్ను రూపంలో మీ మీదనే పడుతుంది. అందుకే మీరు ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించేలా ఉండాలి.
• ముఖ్యమంత్రి గారు, నేను పరస్పరం గౌరవించుకుంటాం…
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు నాకు ఎంతో గౌరవం ఇస్తారు. ఏ విషయంలో కూడా సంప్రదింపులు లేకుండా ముందుకు వెళ్లరు. నేను కూడా ఆయన నాయకత్వ తీరును, ఓపికను దగ్గర నుంచి గమనిస్తూ ప్రతి అంశాన్ని ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలని భావిస్తాను. 2014లో సైతం విభజిత ఆంధ్రప్రదేశ్ బలంగా ముందుకు వెళ్లాలంటే శ్రీ చంద్రబాబు గారు లాంటి గొప్ప నాయకుడు అవసరం అనే ఆనాడు ఏమీ ఆశించకుండా మద్దతు ఇచ్చాం. ఇప్పుడు ఆయన నాయకత్వంలో పని చేయడం కూడా గొప్ప అదృష్టంగానే భావిస్తున్నాం. ప్రజలు మనల్ని నమ్మి ఇచ్చిన మెజారిటీని, వారి ఆశలను నెరవేర్చేలా ఆయన, నేను ఎల్లప్పుడూ పనిచేస్తాం. నేను ఆయనను ముందు వెళ్ళమని చెప్పినా సరే ఆయన మాత్రం కలిసి నడుద్దాం అని చెప్తారు. ఇది ప్రతీ ఒక్కరూ అర్దం చేసుకుని విభేదాలు పక్కన పెట్టి రాష్ట్ర వృద్ధిలో భాగస్వామ్యులు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
• కులం దాటి అభివృద్ధి వైపు అడుగులు వేద్దాం
21వ శతాబ్దంలో కూడా- నా కులం, నా వర్గం అంటే కష్టం. విభేదాలు, సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం. సమస్యలు అందరికి ఉంటాయి. వాటిని శాంతియుత పంథాలో పరిష్కరించుకుందాం. ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది. ఈ సమయంలో కూడా కులాలు, మతాలు అని కూర్చుంటే అభివృద్ధి ముందుకు వెళ్లదు. దానిని దాటి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి అందరి ఆలోచన కావాలి. ఎంతో గొప్ప నాయకత్వ లక్షణాలు ఒక భావ జాలాన్ని బలంగా తీసుకువెళ్లగల సత్తా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మా సంపూర్ణ సహకారం ఉంటుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కలగన్న వికసిత్ భారత్ 2047లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి కావాలి. వికసించిన భారతంలో ఆంధ్రప్రదేశ్ చిరునవ్వులు విరబూయాలి. భారత్ ను చూసి ప్రపంచ దేశాలు భయపడాలన్నా, అభివృద్ధిలో చైనా లాంటి దేశాన్ని అధిగమించాలన్నా సరే దేశ అభివృద్ధితోపాటుగా స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధించడం చాలా కీలకం అనేది అర్థం చేసుకోవాల”న్నారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, 13 ఉమ్మడి జిల్లాల నుంచి పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
#SwarnaAndhra2047 #ViksitBharat2047