రైల్వే న్యూకాలనీ లో సింపుల్ వన్షో రూమ్ ప్రారంభం l #vvwnews

by vvwnews.com

రైల్వే న్యూకాలనీ లో సింపుల్ వన్షో రూమ్ ప్రారంభం అయ్యింది. కంపెనీ నిర్వాహకులు జ్యోతి ప్రజ్వలనం చేసి కొత్త విద్యుత్ వాహనాలను విడుదల చేశారు. సింపుల్ ఎనర్జీ కంపెనీ.. సింపుల్ వన్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ సందర్బంగా షో రూమ్ అధినేత రిషిక్, కంపెనీ ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు సూపర్ లుక్‌తో కిర్రాక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయిని తెలిపారు. విద్యుత్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212 కిలోమీటర్లు వెళ్తుందని చెప్పారు. ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 105 కిలోమీటర్లుగా ఉందన్నారు
ఈ విద్యుత్ స్కూటర్‌లో యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ ఉందన్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్లాక్, రెడ్, వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వన్ ట్యాప్ యాప్ కూడా ఉంటుంది. యాప్ ద్వారా స్కూటర్ కనెక్ట్ అవుతుంది. యాప్ ద్వారానే రిమోట్ యాక్సెస్, ఓటీఏ అప్‌డేట్స్, సింపుల్ ట్యాగ్, సేవ్ అండ్ ఫార్వర్డ్ రూట్స్, రైడ్ స్టాటిస్టిక్స్ వంటి ఫీచర్లు పొందొచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రెండు లక్షల అని చెప్పారు

Use Social Media to Spread the Word about Our News

related articles