విఎంఆర్‌డిఏలో తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి* l #vvwnews #visakapatnam

by vvwnews.com

*ప్రెస్‌ నోట్‌*
*విఎంఆర్‌డిఏలో తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి*
*-యూనియన్‌ గౌరవాధ్యక్షులు వి.కృష్ణారావు డిమాండ్‌*
వి.ఎం.ఆర్‌.డి.ఏ పరిధిలో కైలాస్‌గిరి, ఎన్‌.టి.ఆర్‌.వి.ఎం.ఆర్‌.డి.ఏ పార్కు, డా॥వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి సెంట్రల్‌ పార్కు మరియు తెన్నేటి పార్కులో గత 25 సం॥లుగా పనిచేస్తున్న 11 మంది కార్మికులను 60 ఏళ్ళు నిండిన కారణంగా విధుల నుండి నిలుపుదల చేసారు. వీరంతా సోసైటీ కార్మికులు కాబట్టి వీరిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని వి.ఎం.ఆర్‌.డి.ఏ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) గౌరవాధ్యక్షులు వి.కృష్ణారావు డిమాండ్‌ చేసారు.
తొలగించిన పదకొండు మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిఐటియు నిరసన చేపట్టింది.
ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ 11 మంది కార్మికుల వయస్సు 60 సం॥లు పూర్తయ్యాయని డి.ఎఫ్‌.ఓ, వర్క్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ బలరాం, రమేష్ల ప్రమేయంతో అన్యాయంగా నిలుపుదల చేసారన్నారు. ఎటువంటి నోటీసులు జారీచేయకుండా ఈ చర్యలకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిరచారు. వీరి స్థానంలో ముడుపులు తీసుకొని కార్మికుల్ని, అధికారుల కుటుంబాలను కుటుంబ సభ్యుల్ని వేయించుకోవడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుంది. విఎంఆర్‌డిఏలో సొసైటీకార్మికులుగా 220మంది పనిచేస్తున్నారు. వీరికి ఇఎస్‌ఐ, పిఎఫ్‌, వేతనంతో కూడిన వారంతపు శెలవులు, లేబర్‌ హాలీడేస్‌, కార్మికచట్టాలు అమలు చేయడంలేదు. మరి డైలీవేజ్‌ కార్మికుడికి కార్మికచట్టాలు వర్తింపజేయకుండా శ్రమదోపిడీ చేయడం నేరం. డైలీవేజ్‌ కార్మికుడికి శక్తిమేరకు కష్టపడి పనిచేసే వరకు కొనసాగించాలని లేనిఎడల కార్మికచట్టాలు వర్తింపు చేసి 30ఏళ్ళు పనిచేసిన కాలానికి రిటైర్మెంట్ బెనిఫిట్స్, సెటిల్‌మెంట్‌ చేయాలని డిమాండ్‌చేసారు. పదకొండుమంది కార్మిక కుటుంబాలు రోడ్డున పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని గౌరవ కమీషనర్‌, చైర్మెన్‌లను కోరినా ఇంతవరకు స్పందించికపోవడం అన్యాయం. తక్షణమే జోక్యం చేసుకొని వీరికి న్యాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాంబాబు, డీ నరసింగరావు, ఓ. అప్పారావు, వి అప్పారావు, చిన్నారావు, నాగేశ్వరరావులు పాల్గొన్నారు.
ఇట్లు
వి కృష్ణా రావు
గౌరవాధ్యక్షులు

Use Social Media to Spread the Word about Our News

related articles