రైల్వేలో భద్రత ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ప్రమాదాలు #vvwnews

by vvwnews.com

రైల్వేలో భద్రత ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోతున్నాయని రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు విమర్శించారు. ఈ మేరకు శనివారం ఉదయం జగదాంబ జంక్షన్, సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే అతి పెద్ద ప్రయాణ వ్యవస్థ, ప్రపంచంలోని 4వది అయిన రైల్వే ఇండియన్ రైల్వేలో భద్రతా చర్యలు పాటించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. 2023-24 సంవత్సరంలో 40 ట్రైన్ ప్రమాదాలు జరిగి 313 మంది ప్రయాణికులు, నలుగురు రైల్వే ఎంప్లాయిస్ మృతి చెందడంతో పాటు వేలాది మంది ప్రయాణికులు గాయాల పాలయ్యారని తెలిపారు. .

Use Social Media to Spread the Word about Our News

related articles