రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిన వంటనూనె ధరలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్..#vvwnews

by vvwnews.com

ప్రెస్ నోట్ రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిన వంటనూనె ధరలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం 10 గంటలకు అక్కయ్యపాలెం నరసింహారావు రైతు బజార్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యవసర వస్తువులు కాయగూరల ధరలు భారీగా పెంచి ప్రజలకు ఆహార భద్రత లేకుండా చేస్తున్నాయని మండిపడ్డారు భారీగా పెంచిన వంటనూనె వంటగ్యాసు నిత్యవసర వస్తువుల ధరలు కాయగూరలు ధరలను తగ్గించే ప్రజలకు ఆహార భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజా విగ్రహానికి ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు స్థానిక ప్రజాప్రతినిధులు నిత్యవసర వస్తువుల ధరలు నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రజల పక్షం అని చెప్పిన ప్రజాప్రతినిధులు ఎన్నికల అయిన వెంటనే ఫ్లెక్సీలు వేసుకొని ప్రచారం చేసుకుంటూ సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు తప్ప ప్రజలు కార్మికుల సమస్యలపై నియోజకవర్గ ప్రజలు సమస్యలపై పనిచేసే ప్రజాప్రతినిధులు కరువైన నేటి పరిస్థితులు ప్రజలే తమ సమస్యల పరిష్కారానికి ఎర్రజెండా ప్రజా ఉద్యమాల్లో ప్రజలు భాగస్వాములై ఆహార భద్రత నిత్యవసర వస్తువుల ధరలు తగ్గింపుకు పోరాడాలని పిలుపునిచ్చారు ఈ ధర్నా లో సిపిఐ నాయకులు రావికృష్ణ చిల్లర సంఘం నాయకులు జి శ్రీనివాసరావు పి సాయికుమార్ వెంకరాయుడు ఎం రాము ఏకప్పు తదితరులు పాల్గొన్నారు ఇట్లు జి వామనమూర్తి

Use Social Media to Spread the Word about Our News

related articles