SLUG DELISH EXPRESS FOOD HUB RAMNAGAR VSP విజయదశమి రోజున హీరో కంచర్ల ఉపేంద్ర ప్రారంభించారు

by vvwnews.com

స్లగ్… డెలిష్ express

భోజన ప్రియులకు నాణ్యతతో కూడిన వంటకాలను అందించేందుకు డెలిష్ ఎక్స్ప్రెస్ పేరుతో రెస్టారెంట్ ప్రారంభమైందని సినీ హీరో కంచర్ల ఉపేంద్ర అన్నారు. నగరంలోని 28వ వార్డు పరిధి రామ్ నగర్ లో డెలిష్ ఎక్స్ ప్రెస్ రెస్టారెంట్ ను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా హీరో ఉపేంద్ర రెస్టారెంట్ అధినేతను ఉద్దేశించి మాట్లాడుతూ ఇప్పటివరకు శ్రీకాకుళంలో స్వీట్స్ రంగంలో ఉంటూ ఇప్పుడు వైజాగ్ లో రెస్టారెంట్ వ్యాపారంలోకి ప్రవేశించడం సంతోషమన్నారు. విజయదశమి రోజున ప్రారంభమైన ఈ రెస్టారెంట్ మరిన్ని శాఖలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. విశాఖ వాసులు ఇక్కడి ఫుడ్ ను ఆస్వాదించాలని కోరుతూ, అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. రెస్టారెంట్ అధినేత జై శంకర్ శ్రీనివాస్ మాట్లాడుతూ అందరికీ అందుబాటు ధరలలో వెజ్ అండ్ నాన్ వెజ్ వంటకాలను అందించనున్నామని చెప్పారు. స్విగ్గి, జొమాటో మాదిరిగానే డెలిష్ ఎక్స్ప్రెస్ యాప్ ద్వారా ఎలాంటి ఫుడ్ అయినా online ఆర్డర్ చేసుకోవచ్చని తెలిపారు. కొన్నిరోజుల పాటు డెలివర్ చార్జెస్ లేకుండా ఫుడ్ డెలివరీ చేయడం జరుగుతుందన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles