WORLD HOMELESS DAY 2024 ప్రపంచ నిరస్రాయుల దినోత్సవం జనసేన 32 వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు.

by vvwnews.com

నిరాశ్రయులను ఆదుకోవాలి
— డాక్టర్ కందుల నాగరాజు

దయనీయ స్థితిలో జీవితాలను వెళ్లదీస్తున్న
నిరాశ్రయులను మానవత్వం ప్రతి ఒక్కరు ఆదుకోవాలని
విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు,
32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పేర్కొన్నారు.
గురువారం
ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవం సందర్భంగా ఏ యు టి డి షెల్టర్లలో పని చేస్తున్న
సిబ్బందికి అల్లిపురం నెరేళ్ల కోనేరు వద్ద గలా తన కార్యక్రమంలో డాక్టర్ కందుల నాగరాజు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తమ 32 వ వార్డులోని భీమ్ నగర్ అలాగే టి ఎస్ ఆర్ కాంప్లెక్స్ లో రెండు షెల్టర్లు ఉన్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం వీటిలో 180 మందికి పైగా ఉన్నట్లు తెలిపారు.
ఈ షెల్టర్లు ప్రారంభించినప్పటినుంచి నేటి వరకు
సుమారు
6,442 మంది అభాగ్యులకు పునరావాసం కల్పించడం జరిగిందన్నారు.
పోలీసులు కూడా రైల్వే స్టేషన్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఈ నిరాశ్రయులను తీసుకొచ్చి ఇక్కడ చేర్పిస్తున్నారని వెల్లడించారు.
ఈ షెల్టర్లు పారదర్శకంగా పనిచేయడం వలన చాలామందికి ఉపయోగకరంగా ఉన్నాయని అన్నారు.
ఏ యూ టి డి
సంస్థ డిల్లీలో నడుపుతున్న ఈ షెల్టర్లను చూసి రాష్ట్రంలో మొట్టమొదట 2012 డిశంబర్ లో వైజాగ్ లో జివిఎంసి సహకారంతో ఈ షెల్టర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఆ తరువాత గత టిడిపి ప్రభుత్వ హయాంలో వైజాగ్ షెల్టర్లను చూసి అప్పటి సీఎం గా ఉన్న చంద్రబాబు గారి ఆదేశాలతో రాష్ట్రం అంతటా ప్రారంభమయ్యాయని అన్నారు.
ఈ షెల్టర్లలో పని చేస్తున్న సిబ్బంది సేవలను గుర్తించి వారిని సత్కరించినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో
ఏ యూ టి డి కార్యదర్శి ప్రగడ వాసు,ఆర్.పి.పి
వి.కీర్తి రెడ్డి, ఆర్.పి.పి పి.లావణ్య, శ్రద్ధా ఫౌండేషన్ ప్రతినిధులు హరీష్, గౌతమ్, మేనేజర్ జ్యోతిర్మయి, మేనేజర్ భాస్కర రావు,ధనలక్ష్మి, శ్రీనివాసరావు,
ప్రశాంత్ ఆచారి, జి వి ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles