రానున్న కాలంలో జీవ మనుగడ ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితి #vvwnews #visakapatnam

by vvwnews.com

ఇందనం అధికంగా వాడడం వలన భూమి ఒత్తిడికి గురవడంతో రానున్న కాలంలో జీవ మనుగడ ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితి వస్తుందని బి. శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం డాబాగార్డెన్స్ వద్ద గల వి జె ఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూమిని త్రవ్వి పెట్రోల్, డీజిల్ తదితర ఇందనాన్ని అధికంగా తీయడం వలన భూమి లోతు ఒకటిన్నర కిలోమీటర్లు తగ్గిందని అన్నారు. దీనివలన భూమి చాలా ఒత్తిడికి గురవుతుందని చెప్పారు. ఈ నిజాన్ని ప్రపంచ దేశాల్లో ఉన్న శాస్త్రవేత్తలకు తెలిపేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడతానని పేర్కొన్నారు. ఇందనం వాడకాన్ని తగ్గించి, బ్యాటరీ వాహనాల వైపు ప్రజలంతా మొగ్గు చూపాలని సూచించారు.

Use Social Media to Spread the Word about Our News

related articles