విశాఖలోని పోర్టు స్టేడియంలోని విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్ ఉత్తమ పర్యాటక ప్రాజెక్ట్ అవార్డు #vvwnews

by vvwnews.com

విశాఖలోని పోర్టు స్టేడియంలోని విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్ ఉత్తమ పర్యాటక ప్రాజెక్ట్ అవార్డు పొందింది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం లో అంగరంగ వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశ్వనాధ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ బి. కాశీ విశ్వనాధంకి ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో కాశీ మాట్లాడారు. విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్ కు పర్యాటక కేంద్రంగా అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ క్లబ్ పర్యాటకులు, స్థానికులకు ప్రధాన ఆకర్షణగా మారిందన్నారు
ఈ క్లబ్ వినోదం, సాహసం మరియు క్రీడలకు ఒకే స్థలం అవుతూ విస్తృతమైన కార్యక్రమాలను కలిగి ఉందన్నారు. విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్, లో అందుబాటులో ఉన్న కార్యకలాపాలను వివరించారు. గో-కార్టింగ్, ట్రాంపోలిన్ పార్క్, వివిధ క్రీడలకు అనుకూలమైన మైదానాలు, క్రీడా అకాడెమీలు, కిడ్స్ ప్లే ఏరియా,12D థియేటర్,
లేసర్ వార్స్, జెయింట్ స్వింగ్, రాకెట్ ఎజెక్టర్, అన్ని దిశల్లో తిరిగే 360 సైకిల్,
1500 సీట్ల సామర్థ్యం గల ఆడిటోరియం, ఇండోర్ స్టేడియం, కాఫీ షాప్, డార్క్ లో బ్యాడ్మింటన్,పికిల్‌బాల్ కోర్ట్, ఇప్పటికే ఉన్న సదుపాయాలతో పాటు, సందర్శకుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి అనేక కొత్త ప్రాజెక్టులు కూడా రూపకల్పనలో ఉన్నాయిని చెప్పారు. స్నో వరల్డ్, వాటర్ వరల్డ్, జిప్ లైన్, మినియేచర్ వరల్డ్, ఫోటో స్టూడియో, ఇల్యూషన్ వరల్డ్, రెస్టారెంట్
పింట్‌బాల్, రోప్ కోర్స్, ఇన్వర్టెడ్ హౌస్, స్నూకర్, VR గేమ్స్ ఏర్పాటు అవుతున్నాయిని చెప్పారు.

Use Social Media to Spread the Word about Our News

related articles