ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంకి చెందిన జ్యోతి కొత్తపల్లికి ఇండియాస్ అన్సంగ్ హీరోస్ నేషనల్ అవార్డు దక్కింది. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 25న జైపూర్ నటి సుధా చంద్రచే జాతీయ “ఉమెన్ ఐకాన్ ఆఫ్ ఇండియా”, “భారతదేశపు విశిష్ట వ్యక్తిత్వం” అవార్డును పొందినట్లు తెలిపారు. ఇది ఇండియాస్ అన్సంగ్ హీరోస్ నేషనల్ అవార్డ్ 2024 ద్వారా నిర్వహించ బడుతుందన్నారు. జైపూర్లోని రాడిసన్ బ్లూ హెూటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో అవార్డు ఫంక్షన్ కోసం వివిధ వేదికలను సందర్శించారని తెలియజేశారు. భారతదేశం నుండి వివిధ వేదికలపై సందర్శించిన వ్యక్తులు ఈ అవార్డును అందుకున్నారని, వైద్యులు, విదేశాల నుండి శాస్త్రవేత్తలు, భారతదేశం నుండి శాస్త్రవేత్తలు, ఆర్మీ ఆఫీసర్, ఎయిర్ఫోర్స్ ఆఫీసర్, ఎమ్మెల్యే, మంత్రి మొదలైన ప్రతి ఒక్కరూ ఆ అవార్డును అందుకునేందుకు వచ్చారన్నారు. తనకు సపోర్ట్ చేసిన యుఎస్ బ్యాంక్ టీమ్ మెంబర్స్, పేరెంట్స్, ఫ్రండ్స్కి జ్యోతి కొత్తపల్లి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంకి చెందిన జ్యోతి కొత్తపల్లికి ఇండియాస్ అన్సంగ్ హీరోస్ నేషనల్ అవార్డు#vvwnews
by vvwnews.com
written by vvwnews.com
54