పత్రికా ప్రకటన
చంద్రబాబు పాపాల ప్రక్షాళనలకు మేయర్ ప్రత్యేక పూజలు
విశాఖపట్నం సెప్టెంబర్ 28:
రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనాహుడని తన రాజకీయ ప్రయోజనాలకు తిరుమల వెంకటేశ్వర స్వామినే వాడుకొని లడ్డులో నెయ్యి కల్తీ జరిగిందని దృష్ట ప్రచారం చేస్తున్నారని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి దంపతులు పేర్కొన్నారు. శనివారం మేయర్ దంపతులు హరిలోవ ప్రాంతంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరంలో తిరుమల వెంకటేశ్వర స్వామి నెయ్యి లో కల్తీ జరిగిందన్న చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా పవిత్రత కొరకు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశామని తెలిపారు.
ఈ సందర్భంగా నగర మేయర్ దంపతులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వందరోజుల పాలనలో ప్రజలకు ఏమీ చేయలేదని, దీనిని ప్రజలు వ్యతిరేకిస్తున్న తరుణంలో తమ చేతగానితనాన్ని వైయస్సార్సీపి పార్టీపై నెట్టేందుకు కల్తీ నెయ్యి వ్యవహారం తెరపైకి తెచ్చారని మేయర్ దంపతులు తెలిపారు.