ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థల్లో ఒకటైన ఎంజీఎం హెల్త్ కేర్ సేవలు వినియోగిస్తూ #vvwnews

by vvwnews.com

ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థల్లో ఒకటైన ఎంజీఎం హెల్త్ కేర్ సేవలు వినియోగిస్తూ ఎంజీఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్ గా సేవలు అందించనున్నట్లు ఎంజీఎం హెల్త్ కేర్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత రాజగోపాలన్ తెలిపారు. సిరిపురం స్థానిక హోటల్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజగోపాలన్ తో పాటు వింగ్ కమాండర్, సీఈవో ఎంకే బోస్ సమక్షంలో నూతన లోగోని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డూయింగ్ మోర్ బెటర్ అనే నినాదంతో సెవెన్ హిల్స్ హాస్పిటల్ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఎంజీఎం హెల్త్ కేర్ గా నామకరణం జరిగిందన్నారు. దశాబ్దాలుగా విశాఖలో సేవలందిస్తున్న సెవెన్ హిల్స్ సంస్థ స్ఫూర్తిని పాటిస్తూ ఎంజీఎం నైపుణ్యంతో మధునాతన చికిత్సలు ఆధునిక వైద్య సాంకేతిక విధానంతో మెరుగుపరచడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. పునర్వ్యవస్థీకరించిన ఎంజీఎం సెవెన్ హిల్స్ అదునాతన క్రిటికల్ కేర్ యూనిట్లు, ఇంటెన్స్ కేర్ యూనిట్లు, తోపాటు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు కలిగి ఉన్నాయన్నారు. అలాగే వంద మందికి పైగా వైద్యులు 700 మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులతో సేవలలో క్లిష్టమైన వైద్య పరిస్థితిలను సైతం అధికమించి సమగ్రమైన సంరక్షణ సేవలో అందిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.

Use Social Media to Spread the Word about Our News

related articles