ఇడియోపతిక్ ఇంట్రాక్రానియల్ హైపర్టెన్షన్ దీనివలన ప్రభావిత సమస్యలను ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి#vvwnews

by vvwnews.com

ఇడియోపతిక్ ఇంట్రాక్రానియల్ హైపర్టెన్షన్ దీనివలన ప్రభావిత సమస్యలను ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి న్యూరో ఫిజీషియన్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ప్రముఖ కంటి వైద్యులు వీరేంద్ర సత్యదేవ్ తెలియజేశారు. ముఖ్యంగా గర్భధారణ వయసు 20-50 సంవత్సరాల వయస్సు ఉన్న స్త్రీ లలో, ఊబకాయం, కంటినరం సమస్యలు ఉన్న వ్యక్తులలో ఎక్కువ ఉంటున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. స్టెరాయిడ విట మిన్ ఎ సప్లిమెంట్లు, నోటిద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్ర లు, దీర్ఘకాలం పనిచేసే టెట్రాసైక్లిన్స్ అధిక ఉపయోగం వలన ఐఐహెచ్ కేసుల సంఖ్య పెరుగుదలకు కారణమవుతున్నాయన్నారు. మెదడులో కణితి, ఇన్ఫెక్షన్ లేదా దృష్టి మార్గాలలో అవరోధం లేకుండా మెదడులో పెరిగిన ఒత్తిడిగా ప్రస్పుటమై, ఇది కళ్ళను, మెదడును ప్రభావితం చేస్తుందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఐఐహెచ్ సాధారణంగా ద్రవం మెదడుచుట్టూ నెమ్మదిగా ప్రవహించడం మరియు మెదడు చుట్టూ ద్రవ ప్రసరణ పెరగడం వల్ల వస్తుంది. మన కళ్ళు మెదడుకువిస్తరణ. మెదడు చుట్టూ పెరిగిన ద్రవం కంటి నరాన్ని ప్రభావితం చేసి, దాని వాపుకు కారణమై, తలనొప్పులు, ద్వంద్వ
దృష్టికి దారితీస్తాయన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles