అక్టోబర్ 2 వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా రోటరీక్లబ్ గ్రేటర్ విశాఖ సారధ్యంలో మెగా బ్యాడ్మింటన్#vvwne

by vvwnews.com

అక్టోబర్ 2 వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా రోటరీక్లబ్ గ్రేటర్ విశాఖ సారధ్యంలో మెగా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని క్లబ్ ప్రెసిడెంట్ ఎమ్.డి.యాసిన్ బాబా తెలిపారు. మంగళవారం ద్వారకానగర్ లోని ఆయన ఆఫీసు లో జరిగిన మీడియా సమావేశంలో రోటరీక్లబ్ ప్రతినిధులతో కలసి టోర్నమెంట్ కు సంబంధించిన పోస్టర్ ను ఎమ్.డి.యాసిన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురుషులు, మహిళలు డబుల్స్ విభాగాలు ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. అనకాపల్లి నుంచి ఇచ్ఛాపురం వరకు 22 రోటరీక్లబ్ లకు చెందిన 48 టీమ్ లు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. విశాఖ రైల్వే ఇండోర్ స్టేడియంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న మెగా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో సుమారు వెయ్యి మంది రోటరీక్లబ్ సభ్యులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ బి. బ్రహ్మానందం మాట్లాడుతూ నిరంతరం సేవా దృక్పథంతో పని చేసే రోటరీక్లబ్ పోలియో రహిత ప్రపంచాన్ని నిర్మించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. ఈ టోర్నమెంట్ ద్వారా సేకరించిన నిధులను రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ పోలియో నిధికి అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సి.ఎమ్.ఆర్., ఆయుషుమాన్ హాస్పిటల్, ఎడిన్ ఎలెక్ట్రానిక్స్, ఎయిర్ అండ్ గ్యాస్, ఈటర్స్ స్టాప్ సంస్థలు సహకారాన్ని అందిస్తున్నాయని తెలిపారు. క్లబ్ సెక్రటరీ చింతా నేతాజీ మాట్లాడుతూ ఆసక్తి కలిగిన రోటరీ సభ్యులు తమ పేర్లను ఈ నెల 28 వ తేదీ లోపుగా రిజిస్ట్రర్ చేయించు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ వైస్ ప్రెసిడెంట్ బి. భాస్కర్ రావు, రోటరీ సభ్యులు కే.ఎమ్.కే.రమేష్, సూర్య తేజ తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles