28వార్డు లో మెగా రక్తదాన శిబిరం. …….
విశాఖపట్నం 28 వార్డులో సేవాసదన్ స్కూలో జనసేన నాయకులు మార్గాన్ని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరన్ని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదిన పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం హర్షణీయం అన్నారు
పవన్ కళ్యాణ్ ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని వెలగపూడి రామకృష్ణ బాబు అభిలాషించారు.
నిర్వాహకులు మార్గాన్ని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నగరంలోని రామ్ నగర్ కు చెందిన యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్త దానం చేయడం ఎంతో హర్షించదగ్గ విషయం అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నగరంలో పలు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించామని తెలిపారు ఈ రక్తదాన శిబిరంలో సారిపల్లి మహేష్ నక్కల త్రినాధ్, సన్నపల నాని, గుర్రం కనకరాజు, కోరాడ సంతోష్ వంక ప్రసన్న సాయి 28 వార్డు ప్రజలు పాల్గొన్నారు.